Saturday, May 4, 2024

ఓట్లేస్తేనే నీళ్లు లేకపోతే పాట్లు

- Advertisement -
- Advertisement -

ఓట్లేస్తేనే నీళ్లు అని ఎన్నికల ప్రచార సభలో వ్యాఖ్యానించి కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డికె శివకుమార్ చిక్కుల్లో పడ్డారు. ఆయన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు పేర్కొంటూ ఆయనపై పోలీసు కేసు నమోదు అయింది. ఎన్నికల సంఘం పర్యవేక్షక బృందానికి బిజెపి నుంచి అందిన ఫిర్యాదు ప్రాతిపదికన ఈ కేసు దాఖలు అయినట్లు అధికారులు శనివారం తెలిపారు. బెంగళూరు రూరల్ లోక్‌సభ స్థానంలో ప్రచారానికి వెళ్లిన

దశలో ఉపముఖ్యమంత్రి అక్కడి హౌసింగ్ సొసైటీ ప్రజలను ఉద్ధేశించి మాట్లాడుతూ ఇక్కడి నుంచి తన తమ్ముడు డికె సురేష్ పోటీ చేస్తున్నాడని, ఓట్లేసి గెలిపించాలని లేకపోతే ఇక్కడి కాలనీలకు నీళ్లు బంద్ అని పేర్కొనడం తీవ్ర వ్యవహారం అయింది. కేసుకు దారితీసింది. ఇక్కడ కాలనీల్లో 2510 ఇండ్లు ఉన్నాయి. మొత్తం 6424 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లు తమ పార్టీ వారికి పడితే సాగునీరు తాగు నీరు సమస్యలు తీరుస్తామని చెప్పడం కేవలం బేరాలకు దిగడమే అని పేర్కొంటూ బిజెపి ఫిర్యాదుకు దిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News