Saturday, April 27, 2024

బెదిరింపులు సరికాదు.. పోకిరీ స్కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -
బాధ్యతలను అప్పజెప్పడం దురదృష్టకరం : మంత్రి కెటిఆర్

హైదరాబాద్ : తెలంగాణలో బహిరంగ బెదిరింపులకు పాల్పడుతున్న పోకిరీ స్కాంగ్రెస్ బాధ్యతలను అప్పజెప్పడం నిజంగా దురదృష్టకరమని బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ ట్వీట్ చేశారు. బెదిరింపు ఘటనలను సీరియస్‌గా తీసుకుని, చట్టపరంగా కఠి నంగా వ్యవహరించాలని హోంమంత్రి మహమూద్ అలీ, డిజిపి అంజనీ కుమార్‌ను కెటిఆర్ కోరారు. ఈ ట్వీట్‌ను బిఆర్‌ఎస్ పార్టీ నాయకుడు దాసోజు శ్రవణ్ చేసిన ట్వీట్‌ను కెటిఆర్ షేర్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అనుచరులమని చెప్పుకుంటూ కొంతమంది వ్యక్తులు తన మొబైల్‌కు గురువారం అర్ధరాత్రి 12.15 గంటలకు పదేపదే కాల్స్ చేశారని దాసోజు శ్రవణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని అసభ్యపదజాలంతో బెదిరించారని తెలిపారు.

దీంతో సైబర్ క్రైమ్, సంబంధిత పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయాలనుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ బెదిరింపు కాల్స్‌పై విచారణ జరిపి దోషులను గుర్తించి, చట్టపరమైన చర్యలు చేపట్టాలని అభ్యర్థిస్తాను అని శ్రవణ్ చెప్పారు. తెలంగాణలో బెదిరింపు, రౌడీ రాజకీయాల సంస్కృతిని పెంచి పోషించేన పనిలో రేవంత్‌రెడ్డి నిమగ్నమై ఉండటం దురదృష్టకరం. గతంలో కూడా తన అనుచరుల ద్వారా వి.హనుమంతరావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జగ్గారెడ్డి తదితర సీని యర్లతో సహా తన సొంత పార్టీ సభ్యులపై ఇలాంటి బెదిరింపులకు పాల్పడిన ఆయన ఇలాంటి వ్యూహాలను ప్రయోగించడం ఇదే మొదటిసారి కాదు అని శ్రవణ్ గుర్తు చేశారు. ఈ రౌడీ రాజకీయాలు, చౌకబారు వ్యూహాలు, ప్రజాస్వామ్యం, న్యాయం కోసం పోరాడకుండా తనను అడ్డుకో లేవని రేవంత్ తెలుసుకోవాలి. 125 ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీలో ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్‌ని ఎలా ప్రొత్సహిస్తున్నారు? అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News