Sunday, April 28, 2024

జార్ఖండ్‌లో స్పెయిన్ మహిళపై సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

దుంకా(జార్ఖండ్): జార్ఖండ్‌లోని దుంకా జిల్లాలో స్పెయిన్ దేశానికి చెందిన ఒక మహిళ సామూహిక అత్యాచారానికి గురైనట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఈ దారుణానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాష్ట్ర రాజధాని రాంచికి సుమారు 300 కిలోమీటర్ల దూరంలోని హన్స్‌దిహా పోలీసు స్టేషన్ పరిధిలోగల కురుమాహట్ వద్ద శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. స్పెయిన్ దేశానికి చెందిన ఒక పర్యాటక జంట తాత్కాలికంగా వేసుకున్న గుడారంలో ండగా ఈ ఘటన జరిగింది. బంగ్లాదేశ్ నుంచి ద్విచక్రవాహనంలో దుంకా చేరుకున్న జంట ఇక్కడి నుంచి బీహార్ మీదుగా నేపాల్‌కు వెళ్లవలసి ఉంది.

గత రాత్రి తానే స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్లి అక్కడే ఉన్నానని జిల్లా ఎస్‌పి పీతాంబర్ సింగ్ ఖేన్వర్ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలాన్ని సందర్శించారని ఆయన చెప్పారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని ఒక సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఈ ఘటనలో 7 నుంచి 8 మంది స్థానిక యువకులు పాల్గొన్నారని తన పేరును వెల్లడించడానికి ఇష్టపడని ఆ సీనియర్ అధికారి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ జార్ఖండ్‌ను సందర్శించి రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతలపై ఆందోళన వ్యక్తం చేసిన రోజే ఈ దారుణ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News