Sunday, April 28, 2024

గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Three arrested for selling marijuna

మనతెలంగాణ, హైదరాబాద్ : గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఎనిమిది కిలోల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు, రూ.35,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….నగరంలోని లంగర్‌హౌస్, లక్ష్మినగర్‌కు చెందిన భరత్ సింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మునవత పాండు నగరంలోని అత్తాపూర్‌లో ఉంటూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు, హైదరాబాద్, మంగళ్‌హాట్‌కు చెందిన శంకర్ సింగ్ డిజే ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. భరత్ సింగ్ గతంలో కూడా పలుమార్లు గంజాయి విక్రయిస్తుండడంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భరత్‌ను మంగళ్‌హాట్, ధూల్‌పేట ఎక్సైజ్, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేశారు. పలుమార్లు అరెస్టు కావడంతో పోలీసులు నిందితుడిపై పిడి యాక్ట్ పెట్టారు.

నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించడంతో అక్కడ గంజాయి విక్రయించే వారితో పరిచయం పెంచుకున్నాడు. అక్కడే వేరే కేసులో అరెస్టైన పాండుతో పరిచయం ఏర్పడింది. సులభంగా డబ్బులు సంపాదించాలని భరత్ ప్లాన్ వేశాడు. హైదరాబాద్‌లో అవసరం ఉన్న వారికి గంజాయి విక్రయించాలని ప్లాన్ వేశాడు. జైలు నుంచి భరత్ విడుదలైన తర్వాత గంజాయి కొనుగోలు కోసం పాండును సంప్రదించాడు. పాండు ఒడిశా రాష్ట్రం వెళ్లి తక్కువ ధరకు ఎనిమిది కిలోల గంజాయిని కొనుగోలు చేసి నగరానికి తీసుకుని వచ్చాడు. తర్వాత గంజాయిని భరత్‌సింగ్, శంకర్ సింగ్‌కు అప్పగించాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దర్బార్ మైసమ్మ దేవాలయం వద్ద నిందితులను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం టపాచపుత్ర పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సైలు శ్రీశైలం, నరేందర్, నర్సింహులు, షేక్‌బురాన్, శ్రీనయ్య తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News