Wednesday, May 1, 2024

నగరంలో పెస్టిసైడ్స్ దొంగల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Three pesticides thieves arrested in hyderabad

హైదరాబాద్: కోరమండల్ గోడౌన్ నుంచి ఫెర్టిలైజర్స్‌ను దొంగతనం చేసిన ముగ్గురు నిందితులను ఎల్‌బి నగర్ సిసిఎస్ పోలీసులు, ఆదిబాట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 98 కార్టన్ల పెస్టిసైడ్స్, రెండు కార్లు, బైక్, మూడు మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.1,07,92,400 ఉంటుంది. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎపిలోని కడప జిల్లా, రైల్వే కోడూరు మండలం, రెడ్డివారి పల్లి గ్రామానికి చెందిన రాపూరు దినేష్ రాయ్ కోరోమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో డిస్పాచ్‌లో పనిచేస్తున్నాడు. రంగారెడ్డిజిల్లా నాగోలో, మమతానగర్‌లో ఉంటున్నాడు.

ఎపిలోని వెస్ట్‌గోదావరి జిల్లా, ఉంగుటూరు మండలం, రాచలూరు గ్రామానికి చెందిన నాత ముఖేష్ నిజాంపేటలో ఉంటూ హోటల్ మేనేజ్‌మెంట్ చేస్తున్నాడు. జనగాం జిల్లా, దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామానికి చెందిన చికండి శివప్రసాద్ అలియాస్ శివ హోటల్ మేనేజ్‌మెంట్ చేస్తున్నాడు, సికింద్రాబాద్‌లోని రైల్వే క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. కోరమంల్‌లో పనిచేస్తున్న దినేష్ గోడౌలో సిసి కెమెరాలు, సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో పెస్టిసైడ్స్ చోరీ చేసేందుకు ప్లాన్ వేశాడు. ఈ విషయం మిగతా ఇద్దరికి వివరించాడు. వారు దానిని అంగీకరించి డూప్లికేట్ తాళం చెవితో గోడౌన్‌లోని పెస్టిసైడ్స్‌ను చోరీ చేశారు. ఎర్టిగా, పోలో కారులో వాటిని తరలించారు. చోరీ చేసిన వాటిని శివ ప్రసాద్, ముఖేష్ ఇంట్లో దాచిపెట్టారు. దినేష్ తండ్రి రమేష్ బాబు కోరమండల్‌లో జోనల్ మేనేజర్‌గా పనిచేశాడు అతడి సిఫార్సు మేరకే ఉద్యోగం ఇచ్చారు. ఖరీదైన పెస్టిసైడ్స్ ఉన్నట్లు గమనించిన నిందితుడు వాటిని చోరీ చేశాడు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News