Thursday, May 2, 2024

శ్రీవారి మెట్టును త్వరలోనే అందుబాటులోకి తీసుకోస్తాం..

- Advertisement -
- Advertisement -

చిత్తూరు: తిరుమలకి వెళ్లే శ్రీవారి మెట్టు కొన్ని చోట్ల భారీ వర్షాలకు దెబ్బతినడంతో భక్తులకు అసౌకర్యం ఏర్పడిందని, అతి త్వరలోనే సిద్దం చేసి తిరుమలకి వెళ్లేందుకు భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం‌ జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానముల పాలకమండలి సభ్యుడు పోకల అశోక్ కుమార్ తెలిపారు. శ్రీవారిమెట్టు వద్దకు ఆదివారం పోకల అశోక్ కుమార్ వెల్లి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. నడకదారిలో పడిన రాళ్ళను, మట్టిని త్వరగా తొలగించాలని, నడకదారి మధ్యలో దెబ్బతిన్న మెట్లను పరిశీలించి తొందరగా వాడుకలోకి తీసుకురావాలని టిటిడి ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేశారు. శ్రీనివాసమంగాపురం నుండి శ్రీవారి మెట్టుకు వెళ్లే దారిలో కొన్ని విధ్యుత్ స్థంబాలు నేలకొరగడం వలన విధ్యుత్ సమస్య నెలకొనింది అని తెలుసుకున్న ఆయన విధ్యుత్ అధికారులతో పోన్లో మాట్లాడి వెంటనే పనులు చేయాలని చెప్పారు.

ఈ సందర్భంగ ఆశోక్ కుమార్ మాట్లాడుతూ.. స్వామివారి కృపవలన ఎవ్వరికి ఎలాంటి నష్టం చేకూరలేదని, అనునిత్యం శ్రీవారి భక్తుల గురించి ఆలోచించే తమ టిటిడి పాలకమండలి చైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి ఆలోచనలకు అనుగుణంగా తాము భక్తుల శ్రేయస్సే ముఖ్యంగా పనిచేస్తున్నామని, త్వరలోనే శ్రీవారిమెట్టును ఆధునికరించి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం తోపాటు, రాత్రిపూట విశ్రాంతి తీసుకునేందుకు శ్రీనివాసమంగాపురం వద్ద విశ్రాంతి భవనాలు నిర్మించే ప్రతిపాదన వుందన్నారు. శ్రీవారికి తలనీలలు ఇచ్చేందుకు ఇప్పటికే ఇక్కడ కళ్యాణకట్ట ఏర్పాటు చేయడం జరిగిందని, తలనీలలు ఇచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నందున రానున్న కాలంలో శ్రీనివాసమంగాపురంలో కళ్యాణకట్టను మరింత విస్తరించేలా టిటిడి చైర్మెన్ తో సంప్రదించి పాలకమండలికి తెలియజేస్తామని తెలిపారు.

Tirumala footpath road damage due to Rain

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News