Friday, May 10, 2024

మంగళవారం రాశి ఫలాలు(09-01-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా వుంటాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు.

వృషభం – కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడపుతారు. ధన, వస్తు లాభాలు పొందుతారు. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

మిథునం – పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. దూరప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. సోదరుల నుండి శుభవార్తలు.

కర్కాటకం – బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.

సింహం – ఋణాలు తీరుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి.

కన్య – నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానమునకు కొత్త ఉద్యోగావకాశాలు పొందుతారు. బంధువుల నుండి శుభవార్తలు.

తుల – ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్నా అవసరాలకు డబ్బు అందుతుంది. అనుకోని అవకాశాలు ఆశ్చర్యపరుస్తాయి. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. సన్నిహితుల నుండి ధనలాభం.

వృశ్చికం – వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. సంతానం నుండి ధనలాభం.

ధనుస్సు – ఋణాలు కొంత వరకు తీరుస్తారు. పూర్వమిత్రులను కలుసుకొని కష్టసుఖాలను పంచుకుంటారు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయి.స్వల్పలాభాలు.

మకరం – బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. వస్తు లాభం.

కుంభం – భాగస్వామ్య వ్యాపారాలలో ప్రోత్సాహం లభిస్తుంది. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగావుండును.

మీనం – కుటుంబ సభ్యులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. వివాదాలకు దూరంగా వుండండి. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News