Sunday, April 28, 2024

మంగళవారం రాశి ఫలాలు(26-12-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూర ప్రాంతాల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. విందు, వినోదాలు, సంతానంనకు యత్న కార్యసిద్ధి పొందుతారు.

వృషభం – ప్రయాణాలలో తొందరపాటు వద్దు. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. బంధువర్గంతో ఏర్పడిన తగాదాలు పరిష్కారించుకొంటారు. ఉద్యోగాలలో స్థానమార్పులు.

మిథునం – ఇంటాబయటా ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలుగుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు. సంతానంనకు విద్యా, ఉద్యోగవకాశాలు పొందుతారు.

కర్కాటకం – కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. సోదరుల నుండి ధన, వస్తులాభం.

సింహం – కుటుంబ సభ్యులలో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల మానసిక ఆనందం కలుగుతుంది. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం.

కన్య – బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్థి వృద్ధి చెందుతుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కారం. సంతానంనకు సాంకేతిక విద్యావకాశాలు పొదుతారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది.వస్తు లాభం.

తుల – మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు. పనులు నెమ్మదిగా సాగుతాయి. భూముల క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు అర్జిస్తారు. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు.

వృశ్చికం – నూతన మిత్రులు పరిచయమై కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. భూవివాదాలు తీర నూతన ఒప్పందాలు కుదురుతాయి. శుభుకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. శుభవార్తలు.

ధనుస్సు – ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఉద్యోగాలలో ఏర్పడిన ఇబ్బందులు తొలుగుతాయి. నూతన వస్తు సేకరణ.

మకరం – ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమకు తగిన ఫలితం కష్టమే. పనులో జాప్యం జరిగిన పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఎదురైన ఒత్తిడులు తొలుగుతాయి. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం.

కుంభం – ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. అనుకోని అతిథులను కలిసి కీలక సమాచారం అందుకొంటారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు.

మీనం – కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. తండ్రి తరపు వారి నుండి ధనలాభం పొందుతారు. భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు అర్జిస్తారు. ఆరోగ్యం పట్ల మెలుకువలు అవసరం.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News