Monday, April 29, 2024

పారిస్ నుంచి ముంబైకి దిగ్బంధ విమానానికి విముక్తి

- Advertisement -
- Advertisement -

పారిస్ : భారతీయులతో పారిస్‌లో దిగాల్సి వచ్చిన ఎయిర్‌బస్ ఎ 340 విమానం సోమవారం అక్కడి నుంచి ముంబైకి బయలుదేరి వెళ్లింది. దుబాయ్ నుంచి నికరుగ్వాకు బయలుదేరిన ఈ విమానంలో దాదాపు 300 మంది వరకూ భారతీయులు ఉన్నారు. వీరు అక్రమంగా అమెరికాకు చేరుకునేందుకు బయలుదేరారనే అనుమానాలు రావడంతో ఈ విమానాన్ని రెండుమూడురోజులగా విమానాశ్రయంలో నిలిపివేశారు. ఇప్పుడు విచారణ, తగు సమాచారం రాబట్టుకుని ఈ విమానం ఇండియాకు బయలుదేరేందుకు పారిస్ అధికార యంత్రాంగం అనుమతిని ఇచ్చింది.

అయితే ప్రయాణికులలో ఇద్దరిని ఫ్రెంచ్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ కల్పిస్తున్నారు. ఆరుగురు వ్యక్తులు ఫ్రాన్స్‌లో ఆశ్రయం కోరారు. అయితే వీరికి ఆశ్రయం ఇచ్చారా? లేదా అనేది వెల్లడికాలేదు. అయితే ఈ విమానం ఇక్కడి నుంచి ముంబైకి బయలుదేరిందని ఫ్రెంచ్ వార్తాపత్రిక లి మాండే తెలిపింది. అయితే ప్రయాణికులలో అత్యధికులు ఇండియాకు వెళ్లడానికి సిద్ధంగా లేరని వెల్లడైంది. అయితే వీరి ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా విమానంలో పంపించినట్లు తెలిసింది. దీనితో ముంబైకి ఈ విమానం చేరుకునే దశలో పరిస్థితిపై ఉత్కంఠత నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News