Tuesday, May 7, 2024

బుధవారం రాశి ఫలాలు(31-01-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – వృత్తి-వ్యాపారాలలో లాభాలు పొందుతారు. మార్కెటింగ్ చేసేవారికి సానుకూల పరిస్థితులు ఉంటాయి. కొత్త వ్యక్తులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

వృషభం – ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు.

మిథునం – విద్యార్ధులు కష్టపడి ఉత్తీర్ణత సాదించాలి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది.

కర్కాటకం – ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. స్వల్ప ధన లాభ సూచన

సింహం – వృత్తి-వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సన్నిహితులతో ఆర్ధిక లావాదేవీలు జరుపుతారు.

కన్య – బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యల నుండి బయట పడతారు. పనులు నిదానంగా సాగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు సాగిస్తారు.

తుల – ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాలలో జీవితభాగస్వామి సలహాలు తీసుకొంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. శుభవార్తలు అందుకొంటారు.

వృశ్చికం – ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగస్తులకి స్థాన చలనాలు ఉంటాయి. ముఖ్యమైన విషయ వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

ధనుస్సు – ఆర్ధిక వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. సోదరులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. భాగస్వామ్మ వ్యాపారాలు లాభిస్తాయి.

మకరం – పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్ధిక లావాదేవీలు పుంజుకుంటాయి. సంఘసేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

కుంభం – ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. ఋణాలు తీరి ఊరట చెందుతారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య పరంగా ఉన్న నమన్యల నుండి బయటపడతారు. స్వల్ప ధనలాభం.

మీనం – వృత్తి-వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగస్తులు స్వల్ప లాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. విద్యార్ధులు సంకేతిక విద్యలో రాణించడానికి ఇది అనువైన సమయం.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News