Sunday, May 19, 2024

మంగళ వారం రాశి ఫలాలు(31-10-2023)

- Advertisement -
- Advertisement -

మేషం:- గృహనిర్మాణ పనులు కార్యరూపం దాల్చుతాయి. సంఘంలో గౌరవం పొందుతారు. ఆకస్మిక ధనలాభం వస్తు-వాహనయోగంఉంటుంది. వృత్తి-వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులలో ప్రోత్సాహం లభిస్తుంది.

వృషభం :- మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారస్తులకు ఆర్థికంగా అంత అనుకూలంగా ఉండదు. ఉద్యోగస్తులకుస్థానచలనాలు.బదిలీలపై ఉన్నత హోదాలు లభిస్తాయి. షేర్లు, భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. వస్తులాభం.

మిథునం :- ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి.ఋణాలు అధికమవుతాయి. చర్చాగోష్టులలో చురుకుగా పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

కర్కాటకం :- నూతన వ్యాపారాలు ప్రోత్సాహకంగా ఉంటాయి. విందు, వినోదాలలో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి. ఇంటర్వ్యూలలోవిజయం సాధిస్తారు. అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

సింహం:- కుటుంబ సమన్యలు తీరి ప్రశాంతత పొందుతారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలుతీసుకుంటారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. విద్యా, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి.

కన్య:- బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కారించుకొంటారు. ఆరోగ్య సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. ధీర్ఘకాలికఋణాల నుండి బయటపడతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పురోగతి ఉంటుంది.

తుల:- ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు ధనం సమకూరుతుంది. ఉధ్యోగస్తులకు బాధ్యతలు పెరిగినాసమర్ధవంతంగా నిర్వహిస్తారు. సంతానంపురోగతి సాధిస్తారు.

వృశ్చికం:– ప్రముఖుల కలయిక. రాజకీయ కళారంగాల వారికి సన్మాన యోగాలుగొచ్చరిస్తున్నాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమైలబ్ది పొందుతారు. దూరప్రాంతాలనుండిశుభవార్తలువింటారు.వివాహయత్నాలుఅనుకూలిస్తాయి.

ధనుస్సు:- వృతి-వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులనుండి వచ్చిన ఆర్ధిక పరమైన ఒత్తిడులు తీరుతాయి. ఉద్యోగాలలో స్థానచలనం. సేవరంగాలలో పాల్గొంటారు.

మకరం :- కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.వృత్తి-వ్యాపారాలు లాభిస్తాయి. తండ్రి నుండి ఆస్తి లాభం పొందుతారు. వాహన సౌఖ్యం.విందు, వినోదాలలో పాల్గొంటారు.

కుంభం:- ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. వాహనం,ఆరోగ్యంపట్ల మెలుకువ చాలా అవసరం. ప్రయాణాలు లాభిస్తాయి. క్రయ, విక్రయాలలో లాభాలు పొందుతారు.

మీనం:- కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు.ధన, వస్తు లాభాలు. ముఖ్యమైనపనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణపెరుగుతుంది.స్వల్ప పెట్టుబడులకి తగిన సమయం. వాహనాలు కొనుగోలుచేస్తారు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News