Wednesday, May 8, 2024

హ్యాట్రిక్ గెలుపు ఎవరిదో?

- Advertisement -
- Advertisement -

Tomorrow match between Australia England

రేపు ఇంగ్లండ్‌తో ఆస్ట్రేలియా పోరు

దుబాయి: వరుస విజయాలతో జోరుమీదున్న ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు శనివారం జరిగే గ్రూప్2 పోరుకు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. ఇప్పటికే రెండేసి విజయాలు అందుకున్న ఇరు జట్లు హ్యాట్రిక్ గెలుపుపై కన్నేశాయి. సౌతాఫ్రికా, శ్రీలంకలతో జరిగిన మ్యాచుల్లో ఆస్ట్రేలియా జయకేతనం ఎగుర వేసింది. ఇక ఇంగ్లండ్ కూడా రెండు విజయాలను సాధించింది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్ తర్వాతి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. ఇక ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్‌ను నమోదు చేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు కిందటి మ్యాచ్‌లో లంకను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కనబరచాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రెండు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. వార్నర్, ఫించ్‌లు ఫామ్‌లోకి రావడం ఆస్ట్రేలియాకు అతి పెద్ద ఊరటగా చెప్పాలి. ఇంగ్లండ్ జట్టులోనూ ఓపెనర్లు జోస్ బట్లర్, జేసన్ రాయ్‌లు జోరుమీదున్నారు. బౌలింగ్‌లో కూడా మోర్గాన్ సేన బలంగా ఉంది. బలబలాల్లో ఇరు జట్లు సమంగా ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం.

ఓపెనర్లే కీలకం..

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఫించ్‌లపై భారీ ఆశలు పెట్టుకుంది. కిందటి మ్యాచ్‌లో ఇద్దరు మెరుగైన ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు మళ్లీ గాడిలో పడడం ఆస్ట్రేలియాకు కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. కొంతకాలంగా వరుస వైఫల్యాలు చవిచూస్తున్న వార్నర్ కిందటి మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో వార్నర్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈసారి మరింత మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. ఫించ్ కూడా తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే ఆస్ట్రేలియాకు భారీ స్కోరు ఖాయం. మరోవైపు స్టీవ్ స్మిత్, మిఛెల్ మార్ష్, స్టోయినిస్, మాక్స్‌వెల్, మాథ్యూవేడ్ తదితరులతో ఆసీస్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక స్టార్క్, హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, కమిన్స్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉండనే ఉన్నారు. దీంతో ఆస్ట్రేలియా కూడా ఈ మ్యాచ్‌లో గెలుపే లక్షంగా బరిలోకి దిగుతోంది.

మూడో గెలుపు కోసం..

మరోవైపు ఇంగ్లండ్ కూడా మూడో విజయంపై కన్నేసింది. ఆస్ట్రేలియాను కూడా ఓడించడంద్వారా సెమీస్‌కు మరింత చేరువ కావాలనే పట్టుదలతో ఉంది. రాయ్, బట్లర్, మోయిన్ అలీ, బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్‌లతో ఇంగ్లండ్ బ్యాటింగ్ చాలా బలంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ మ్యాచ్‌లో రాయ్, డేవిడ్ మలాన్‌లు చెలరేగి ఆడాడు. ఈసారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అయితే కెప్టెన్ మోర్గాన్ ఫామ్ జట్టును కలవరానికి గురి చేస్తోంది. ఇక బౌలింగ్‌లో ఇంగ్లండ్‌కు తిరుగేలేదు. రషీద్, వోక్స్, మిల్స్, జోర్డాన్, మోయిన్ తదితరులతో బౌలింగ్ విభాగం చాలా బలంగా ఉంది. రెండు విభాగాల్లో సమతూకంగా ఉన్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News