- Advertisement -
ములుగు జిల్లాలోని వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతం ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కొత్త కళను సంతరించుకుంది. ‘తెలంగాణ మినీ నయాగరా‘గా పేరుగాంచిన ఈ జలపాతం దట్టమైన అడవుల మధ్య కొండకోనల నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న జలధారాలతో పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ జలకళను చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జలపాతం వద్ద ఉన్న ఈత కొలనులో పర్యాటకులు చిన్న పెద్ద తేడా లేకుండా జలకాలాడుతూ బోగత అందాలను తమ కెమెరాలు బంధిస్తూ ఫోటోలు దిగుతూ ఆనందంగా గడిపారు. అటవీ అధికారులు జలపాతం వద్ద పర్యాటకులు నూతన ప్రాంతానికి వెళ్లకుండా పర్యవేక్షిస్తున్నారు.
- Advertisement -