Friday, May 3, 2024

నేటి నుంచి తహసీల్దార్‌లకు ‘ధరణి’పై శిక్షణ

- Advertisement -
- Advertisement -

Training for Tahsildars on Dharani portal from today

 

పోర్టల్ ప్రారంభం నేపథ్యంలో శిక్షణ

మనతెలంగాణ/హైదరాబాద్: నేటి నుంచి తహసీల్దార్‌లు, డిఫ్యూటీ తహసీల్దార్‌లకు ధరణి పోర్టల్‌పై శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 29వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పోర్టల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఘట్‌కేసర్‌లోని అనురాగ్ కాలేజీలో ఈ శిక్షణా కార్యక్రమం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇప్పటికీ ధరణి వెబ్‌సైట్‌కు సంబంధించి మండలాల వారీగా ట్రయల్న్ కొనసాగుతోంది. 29న పోర్టల్ ప్రారంభించగానే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ సేవలు ప్రారంభమవుతాయని, దీంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ బాధ్యతలు తహసీల్దార్‌లకు, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ బాధ్యతలు సబ్ రిజిస్ట్రార్‌లు నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు ఒక్కో తహసీల్దార్ రోజుకు 20కిపైగా రిజిస్ట్రేషన్‌లను ట్రయల్న్‌ల్రో భాగంగా నిర్వహిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News