Sunday, May 5, 2024

ట్రాన్స్‌జెండర్లను సాటిమనుషులుగా గౌరవించాలి

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ బ్యూరో : ట్రాన్స్‌జెండర్లను సాటి మనుషులుగా గుర్తిస్తూ వారిపట్ల మర్యాదగా వ్యవహరించాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధ హితవు పలికారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు భవన సముదాయంలో న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ట్రాన్స్‌జెండర్లు, సెక్స్‌వర్కర్లకు పోస్టల్‌శాఖ ద్వారా అమలవుతున్న గ్రూప్ ఆక్సిడెంటర్ పాలసీ బాండ్‌లను ఆమె పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్ల పట్ల వివక్ష చూపడం ఎంతమాత్రం తగదని, రాజ్యాంగంలో కూడా ఇదే విషయం ప్రస్తావించబడిందన్నారు. ట్రాన్స్‌జెండర్లను అన్నిరంగాల్లో ప్రోత్సహిస్తూ వారికి సమాన అవకాశాలు లభించేలా కృషిచేయాలన్నారు. పోస్టల్‌శాఖ ద్వారా కేవలం 399 రూపాయల ప్రీమియంతో 10లక్షల రూపాయల ప్రమాద బీమాతో పాటు ఇతర అనేక ప్రయోజనాలు కలిగి ఉన్న గ్రూప్ ఆక్సిడెంటల్ పాలసీ గార్డ్‌ను ట్రాన్స్‌జెండర్లు, సెక్స్‌వర్కర్లకు వర్తింపజేయడం అభినందనీయమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ప్రతినిధులు ప్రశంసించారు.

ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో డిఎల్‌ఎస్‌ఎ ముందంజలో నిలుస్తోందని కొనియాడారు. భవిష్యత్‌లోనూ మరింత విస్తృతస్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సాంకేతికభివృద్ధి కారణంగా నేటి సమాజంలో పోస్టల్‌శాఖ ను మరిచిపోయారని, ఫలితంగా ఈ శాఖ ద్వారా అమలవుతున్న ప్రమాదబీమా వంటి ప్రయోజనాలను ప్రజలవరకు చేరలేకపోతున్నాయని అభిప్రాయపడ్డారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తున్న పోస్టల్‌శాఖ ప్రమాదబీమా పాలసీ గురించి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ అర్హులైన ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకునేలా చూడాలని అధికారులను సూచించారు. జిల్లా జడ్జి కె.సునీత మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్లు, సెక్స్‌వర్కర్లకు ఏదైనా మేలు చేకూర్చాలనే తలంపుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు.

దాతలు ముందుకువచ్చి సుమారు రూ.30 వేలు విరాళంగా అందించగా, దీనిని ప్రీమీయం కోసం వెచ్చిస్తూ 50మంది ట్రాన్స్‌జెండర్లు, సెక్స్‌వర్కర్లకు ఉచితంగా బీమా బాండ్లు న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో అందించడం జరిగిందన్నారు. జిల్లా న్యాయసేవా సం స్థ ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సహకరిస్తోందన్నారు. ఈ కార్యక్రమం అనంతరం హైకోరుట జడ్జి న్యా యాధికారులతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు.

హైకోర్టు జడ్జికి ఘన స్వాగతం..
హైకోర్టు జడ్జి బి.శ్రీసుధ శనివారం నిజామాబాద్ పర్యటనకు హాజరైన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆమె స్థానిక రోడ్లు, భవనాలశాఖ అతిథి గృహం వద్దకు చేరుకోగా జిల్లా జడ్జి కె.సునీత, జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, అదపు కలెక్టర్ చిత్రా మిశ్రా, ట్రైనీ అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి, నిజామాబాద్ ఆర్డీ రవి, అదనపు సిపి మధుసూదన్‌రావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి , రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్‌రె డ్డి, ఆయాశాఖల అధికారులు, న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు బార్ అ సోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కలు అందించి స్వా గతం పలికారు. అంతకుముందు పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News