Monday, April 29, 2024

సిక్కింలో ఆకస్మిక వరదలు.. చిక్కుకుపోయిన 2400 మంది పర్యాటకులు

- Advertisement -
- Advertisement -

గ్యాంగ్‌టక్ : సిక్కింలో కుంభవృష్టికి ఆకస్మికంగా వరదలు ముంచెత్తడంతో దాదాపు 2400 మంది పర్యాటకులు లాచెన్‌లాచుంగ్ ప్రాంతంలో చిక్కుకు పోయారని అధికారులు వెల్లడించారు. గురువారం నుంచి ఉత్తర సిక్కిం లోని మంగాన్ జిల్లాలో భారీగా వర్షం కురుస్తోంది. పెంగాంగ్ సప్లయ్ ఖోలా వద్ద మంగాన్ జిల్లా కేంద్రం నుంచి చుంగ్‌ధాగ్ వెళ్లే రోడ్డును వరద ముంచెత్తింతి. అనేక చోట్ల రోడ్డు దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

అక్కడి హోటళ్ల లోనే పర్యాటకులు చిక్కుకుపోయారు. వీరిలో 1675 మంది స్వదేశీ పర్యాటకులు కాగా, 36 మంది విదేశీయులు ఉన్నారు. 345 కార్లు, 11 బైకులు బురదలో కూరుకుపోయాయని అధికారులు తెలిపారు. జిల్లా విపత్తు నిర్వహణ సిబ్బంది, సిక్కిం పోలీస్‌లు , బీఆర్‌వో , ఐటీబీపీ, ఆర్మీ బృందాలు కలిసి సహాయక చర్యలు మొదలు పెట్టాయి. పర్యాటకులను తరలించడానికి తాత్కాలిక వంతెనలు ఏర్పాటు చేశారు. అలాగే వీరిని తరలించడానికి 19 బస్సులు, 70 చిన్న వాహనాలు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News