Sunday, May 5, 2024

గిరిజనుల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: గిరిజనుల అభివృద్ధే ధ్యేయంగా కేసీఅర్ ప్ర భుత్వం పని చేస్తుందని సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మంగళవారం హలియా లక్ష్మినర్సింహాగార్డెన్స్‌లో 1026 మంది గిరిజన రైతులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పా ల్గొని మాట్లాడుతూ సీఏం కెసిఅర్ గిరిజన పక్షపాతి అని, గత కాంగ్రెస్ పాలకులు గిరిజనులను ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే ఉపయోగించుకున్నా రు కానీ వారి అభివృద్దికి పాటుపడేలేదన్నారు.

గిరిజనులకు 10 శాతం రి జర్వేషన్ పెంచడంతో పాటు తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సిఏం కెసిఅర్ ది అన్నారు. రాష్ట్రంలో 7 లక్షల 19వేల ఎకరాల అ టవీ భూములను గిరిజనులకు పంచిన ఏకైక నాయకుడు కెసిఅర్ అని, సాగర్ నియోజకవర్గంలో గిరిజనులకు జానా చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు విని మోసపోతే గోస పడుతారని, వ్య వసాయానికి ఉచిత విద్యుత్ దండగా అన్న రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని రైతులు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

అంతకు ముందు ప్రధాన సె ంటర్ నుంచి గిరిజనులతో స్థానిక లక్ష్మినర్సింహాగార్డెన్స్ వరకు ఊరేగింపుగా వచ్చారు. కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్‌నాయక్ ఆర్‌డీవో చెన్నయ్య, జడ్పి వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, జడ్పిటిసి అబ్బిడి కృష్ణారెడ్డి, పీడీ రాజ్‌కుమార్, జిల్లా డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అ ంజయ్య, మున్సిపాల్ చైర్మన్ వెంపటి పార్వతమ్మశంకరయ్య, ఎంపీపీ బొ ల్లం జయమ్మ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇనాం భూముల పంపిణీ: తిరుమలగిరి మండలంలో నలుగురు పేరు మీద ఉన్న ఇనాం భూములను ఎమ్మెల్యే నోముల భగత్ 72 మంది పేదలకు మంగళవారం క్యాంపు కార్యాలయంలో పట్టాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సం క్షేమ పథకాలు అందుతున్నాయని, గత పాలకుల నిర్లక్షం వల్లే ఈప్రా ంతం వెనకబడిందని, తిరుమలగిరి ప్రాంతాన్ని మండల కేంద్రంగా చేసిన ఘనత కెసిఅర్‌ది అన్నారు. కార్యక్రమంలో జెడ్‌పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దు లు, డీసీసీబీ విరిగినేని అంజయ్య, జవ్వాజి వెంకటేశ్వర్లు, పిడిగం నాగయ్య, ఎంఆర్‌వో పాండునాయక్, బీఅర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News