Tuesday, April 30, 2024

యంగ్ హీరోయిన్లకు ధీటుగా..

- Advertisement -
- Advertisement -

Trisha competition to young heroines

 

సౌత్‌లో సీనియర్ హీరోయిన్లలో ఒకరైన త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ’నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ’వర్షం’ సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. సీనియర్ హీరోలు, కుర్ర హీరోలు అని తేడా లేకుండా అందరితో నటించింది. చిరంజీవి, నాగార్జున,- వెంకటేష్, -బాలకృష్ణ-, మహేష్ బాబు, ప్రభాస్, పవన్‌కళ్యాణ్,- ఎన్టీఆర్, – రవితేజ లాంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది. అయితే కొన్నాళ్లుగా తెలుగులో పెద్దగా అవకాశాలు తెచ్చుకోలేకపోయిన త్రిష తమిళంలో మాత్రం వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కెరీర్‌లో ఎప్పుడూ లేనంతగా ఫుల్ ఫామ్‌లో ఉంది ఈ బ్యూటీ. ఇక తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ’ఆచార్య’ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా డేట్స్ క్లాష్ కావడంతో వదులుకుంది.

కాగా ప్రస్తుతం త్రిష నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఆమె చేతిలో మరో నాలుగు ప్రాజెక్ట్ ఉన్నాయి. తమిళ్ లో త్రిష నటించిన పారపాధమ్ విలయట్టు, గర్జనాని సినిమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలోనూ నటిస్తోంది ఈ బ్యూటీ. అలాగే రాంగీ, షుగర్ అనే సినిమాలు కూడా చిత్రీకరణ దశలో ఉన్నాయి. వీటితో పాటు మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ అప్‌కమింగ్ మూవీ ‘రామ్’లో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. కరోనా నేపథ్యంలో ఆగిన ’రామ్’ షూటింగ్ ఇప్పుడు మళ్ళీ ప్రారంభమైంది. త్రిష కూడా ఈ చిత్రీకరణలో పాల్గొంటోంది. అందరూ స్టార్ హీరోయిన్లు కరోనా నేపథ్యంలో బయటకు రావడానికి కూడా భయపడుతుంటే త్రిష మాత్రం ధైర్యంగా షూటింగ్‌కి హాజరవుతోందట. దీంతో ఈ విషయం ఇప్పుడు తమిళ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి త్రిష 37 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోయిన్లకు పోటీనిస్తూ వరుస ఆఫర్లు దక్కించుకుంటూ తన హవా చూపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News