Friday, May 3, 2024

ప్రచారంలో దూసుకెళ్తున్న కారు

- Advertisement -
- Advertisement -

TRS Speed Up GHMC Election Campaign

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో టిఆర్‌ఎస్ అభ్యర్దులు జెడ్ స్పీడ్‌లో దూసుకపోతున్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం నగరంలో చేపట్టిన అభివృద్ది పథకాలను ప్రజలకు వివరిస్తూ మరోసారి అవకాశం కల్పించి, అభివృద్ది మరింత ముందుకు సాగేలా సహకరించాలని కోరుతున్నారు. ప్రచార బాధ్యతలను పూర్తిగా భుజాలపై వేసుకున్న యువనేత, మంత్రి కేటీఆర్ రెండు రోజుల కితం రోడ్ షోలకు శ్రీకారం చుట్టారు. మొదటి రోజు కూకట్‌పల్లి, కుత్బులాపూర్ నియోజకవర్గాల్లో చేపట్టిన ప్రచారానికి విపక్ష పార్టీలు ఖంగు తిన్నాయి. సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు సాగిన ప్రచారంలో స్దానిక ప్రజలు యువనేతకు అడుగడునా నీరాజనాలు పట్టి, మళ్లీ టిఆర్‌ఎస్‌దే మేయర్ పీఠమని భరోసా కల్పించారు. దీంతో పోటీ చేసిన అభ్యర్దులు బస్తీలు, కాలనీల్లో ఇంటింటికి తిరిగి ప్రతి ఒకరిని పలకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ గెలిచిన తరువాత ఖచ్చితంగా నేర్చుతామని హామీ ఇస్తుండటంతో ఓటర్ల అభ్యర్దులకు బ్రహ్మరథం పడుతున్నారు.

తమ ఇంటి వద్దకు వచ్చి నాయకులకు హరతి పట్టి దీవిస్తున్నారు. వృద్దులు, వితంతువులు, వికలాంగులు ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్ని సీఎం కేసీఆర్‌తో గ్రేటర్ నగర రూపురేఖలు మారుతాయని, రెండోసారి అధికారి కట్టబెట్టి రుణం తీర్చుకోవాలని ఓటర్లకు వివరిస్తున్నారు. మహానగరం పరిధిలోని 150 డివిజన్లలో అభ్యర్దులు అట్టహాసంగా ప్రచారం చేస్తూ ఆట పాటలతో పాదయాత్ర చేస్తూ కలియ తిరుగుతున్నారు. పోటీ చేసే అభ్యర్దులో ఎక్కువశాతం సిట్టింగులు ఉండటంతో వారంతా గతంలో తమ కార్పొరేటర్ పరిధిలోని అన్ని వర్గాల ప్రజలతో మంచి సంబంధాలు ఉండటంతో పాటు, ప్రభుత్వం నుంచి వచ్చి సంక్షేమ పథకాలు స్వయంగా ఇంటికి వెళ్లి అందించడంతో వారిని గుర్తు పట్టి, ఈసారి మీఓటు మాకే వేయాలంటూ కోరడంతో వారు ఖచ్చితంగా మరోసారి గెలిస్తామని చేతిలో చేయి వేస్తూ అభ్యర్దులకు ధైర్యం కల్పిస్తున్నారు. స్వయంగా ఓటర్లే టిఆర్‌ఎస్ అభ్యర్దులు గతంలో గెలిచి వారి కంటే ఎక్కువమంది విజయసాధిస్తారని పేర్కొంటున్నారు.

రోజు రోజుకు ప్రజలను అనుహ్యమైన స్పందన రావడంతో పోటీ చేసిన కార్పొరేటర్ అభ్యర్దుల ముఖంలో గెలుపు కళ కనిపిస్తుంది. రెండో రోజు మంత్రి కేటీఆర్ ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలోని పలు డివిజన్‌లో రోడ్‌షోలు నిర్వహించడంతో, పలు డివిజన్‌లకు చెందిన ప్రజలు తండోపతండాలుగా కదలించి ఆయన ఘన స్వాగతం పలికారు. ప్రజాదరణ చూస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి పథకాలే తమకు గెలుపు బాట వేస్తున్నాయని అనుచరులతో నాయకులు వెల్లడిస్తున్నారు. మరోపక్క మంత్రి కేటీఆర్ నగరంలో ప్లైఓవర్లు, పార్కులు, చెరువుల సుందరీకరణ, తాగునీటి సరఫరా, ఇంటి అనుమతులు, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేస్తామని హామీలు ఇవ్వడంతో ప్రజలు హర్షధ్వనాలు పలుకుతున్నారు. కేటీఆర్ హమీలు ఐదేళ్లలో పూర్తియి ప్రజలకు అందుబాటులోకి వస్తే గ్రేటర్‌లో టిఆర్‌ఎస్ పార్టీ తిరుగులేని శక్తి ఏర్పడుతుందని నగర ప్రజలు పేర్కొంటున్నారు. గతంలో ఎన్నడులేని విధంగా నగర ప్రజల నుంచి స్పందన రావడం గులాబీ శ్రేణులో ఉత్సాహం పెరిగిపోతున్నట్లు అభ్యర్దులు వెల్లడిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News