Saturday, April 27, 2024

బిజెపి అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరు: కడియం శ్రీహరి

- Advertisement -
- Advertisement -

kadiyam srihari campaign for trs candidate in gachibowli

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ చేస్తున్న అసత్యప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఆరేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తుచేస్తూ, ప్రజలను ఓట్లు అడగుతున్నారు. ఆదివారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్‌పల్లి ఎన్‌టీఆర్ నగర్, గోపన్‌పల్లి తండాలో నిర్వహించిన ఎన్నికల పాదయాత్రలో అభ్యర్థి సాయిబాబాతో ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిసి కారు గుర్తు అభ్యర్థి సాయిబాబాకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్‌లో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల జరగలంటే టీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తికే మద్దతు పలకాలని కొరారు. నేడు బిజెపి,కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం మళ్లీ ప్రజల్లోకి వస్తున్నారని వారిని ఎక్కడికక్కడ నీలదీయాలన్నారు. ప్రజల కోసం పని చేసే ప్రభుత్వనికి అదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డివిజన్‌లోని నెలకొన్న సమస్యలను పూర్తిగా పరిష్కరించామని మిగిత పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

రూ.21 కోట్లతో తాగునీటి ప్రాజెక్టును సైతం రూపొందించడం జరిగిందని దీనివల్ల నగరంలో ఎక్కడ తాగునీటి ఇబ్బందలు తలెత్తదన్నారు. మున్సిపల్ మంత్రి కెటిఆర్ ఆద్వర్యంలో దేశం మొత్తం నగరం వైపు చూస్తోందన్నారు. కేశశ్‌నగర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి హైదరాబాద్‌కు 24 గంటల మంచినీటి సరఫరా అందించడానికి కృషి చేస్తామన్నారు. కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో సాగుతుందన్నారు. ప్రశాంతంగా ఉన్న హైదారాబాద్‌లో శాంతి భద్రతలు కాపాడి రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు తీసుకొస్తున్న మంత్రి కెటిఆర్‌కు కేంద్రం ప్రభుత్వ మంత్రులు సైతం అభినందించారని గుర్తు చేవారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో బిజెపి ఆటలు సాగవన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రశాంతమైన వాతావరణం మెరుగైన జీవన ప్రమాణాలు కావాలంటే కారు గుర్తుకే ఓటు వేసి కొమిరిశెట్టి సాయిబాబాను భారీ మోజరిటీ తో గెలిపించి ముఖ్యమంత్రికి కెసిఆర్‌కు కానుకగా అందించాలని ఓటర్లను కడియం కోరారు. కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News