Monday, May 6, 2024

నగరంలో రూ.67 వేల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి

- Advertisement -
- Advertisement -

Minister Talasani Election Campaign in Sanath Nagar

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం హైదరాబాద్ నగరంలో రూ.67 వేల కోట్ల అభివృద్ధి పనులు జరిగినట్లు పశుసంవర్ధక, మత్స పాడి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఆదివారం సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్‌పేట డివిజన్ బిజెఆర్‌నగర్ కార్పోరేటర్ అభ్యర్థికి మద్దతుగా ఆయన ఢంకా మోగించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వలో, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ఆధ్వర్యంలో జిహెచ్‌ఎంసిలో పరిధిలో రోడ్లు, ఫ్లై ఓవర్‌లు, అండర్‌పాస్‌ల నిర్మాణం, పార్క్‌ల అభివృద్ది కార్యక్రమాలు జరిగాయని వివరించారు. తప్పుడు ప్రచారాలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న పార్టీలకు ప్రజలే బుద్దిచెబుతారని హెచ్చరించారు. అభివృద్ది కావాలని ప్రజలు కోరుకుంటున్నానరని అందుకు టిఆర్‌ఎస్ అభ్యర్థులను అత్యధిక స్థానాలతో గెలిపిస్తారని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. అనంతరం సనత్‌నగర్ డివిజన్‌లోని అల్లాఉద్దిన్ కోఠీ అభ్యర్థికి మద్దతు ఇంచార్జ్ పురాణం సతీష్ ఆత్రం సక్కులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సనత్‌నగర్ నియోజక వర్గంలోని గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.800 కోట్ల అభివృద్ది పనులు జరిగాయని మరింత అభివృద్ది జరగాలంటే కారు గుర్తుపై ఓటేసి టిఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News