Friday, May 3, 2024

వక్రమార్గంలో పీఠం ఎక్కాలనుకోవద్దు: బైడెన్‌కు ట్రంప్ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

Trump warns Biden should not Wrongfully claim presidency

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చరిత్రాత్మక విజయానికి డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ చేరువవుతూ ఉండగా, మరోవైపు ట్రంప్ విజయావకాశాలు సన్నగిల్లుతూ వస్తున్నాయి. అయితే ఓట్ల లెక్కింపులో చాలా అవకతవకలు జరిగాయని, గడువు పూర్తయినా పోస్టల్ బ్యాలెట్లను స్వీకరిస్తున్నారని ఆరోపిస్తూ తాజా ఫలితాలపై కోర్టుకు వెళతానని చెబుతున్న ట్రంప్.. మరోసారి ప్రత్యర్థి జో బైడెన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాస్వామ్య రాజ్యంలో వక్రమార్గంలో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలని అనుకోవద్దని హెచ్చరించారు. ‘బైడెన్.. తప్పుడు మార్గంలో అధ్యక్షుడిగా ప్రకటించుకోకూడదు. అలా నేను కూడా చేయగలను. ఇప్పుడే చట్టపరమైన ప్రక్రియ ప్రారంభమైంది’ అంటూ ట్వీట్ చేశారు.

మరో వైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అయితే ముందునుంచి ట్రంప్ ఆధిక్యంలో ఉన్న జార్జియా, పెన్సిల్వేనియాలలో బైడెన్ ఆధిక్యతలోకి దూసుకు రావడంతో ట్రంప్ ఓటమి అంచులకు చేరుకున్నారు.16 ఎలక్టోరల్ ఓట్లున్న జార్జియాలో 99 శాతం ఓట్ల లెక్కింపు ఇప్పటికే పూర్తయింది. అలాగే 20 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియాలో 96 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయింది. మరోవైపు ఆరు ఎలక్టోరల్ ఓటున్న నెవాడలో బైడెన్ మొదటినుంచి ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఈమూడు రాష్ట్రాల్లో ఏ ఒక్కదానిలో గెలిచినా బైడెన్ విజయం ఖాయం అవుతుంది. ఎన్నికల రాత్రి వరకు ఈ రాష్ట్రాల్లో తనకు భారీ ఆధిక్యత ఉండిందని, అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఆశ్చర్యకరంగా ఈ అధిక్యత అంతా మాయమైందని ఆయన అంటూ, బహుశా తమ న్యాయపోరాటం ముందుకు సాగితే ఈ ఆధిక్యత మళ్లీ తిరిగి రావచ్చన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Trump warns Biden should not Wrongfully claim presidency

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News