Sunday, April 28, 2024

కళ్యాణలక్ష్మి అక్రమాలపై సర్కారు సీరియస్

- Advertisement -
- Advertisement -

TS government is serious on Kalyana Lakshmi scam

 

విచారణ చేపడుతున్న విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్
దళారుల పాత్రపై లోతుగా విచారణ

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలులో చోటుచేసుకున్న అక్రమాలపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈక్రమంలో ప్రభుత్వ పథకాల అమలులో జరిగిన అక్రమాలపై విచారణ వేగవంతం చేసి నివేదిక సమర్పించాలని ఆదిలాబాద్ కలెక్టర్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అదేశాలిచ్చింది. ముఖ్యంగా బ్యాంకు ఖాతాలో పూర్తి పేర్లు లేకుండా, రెండు, మూడు సార్లు లబ్దిపొందినట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల విచారణలో వెల్లడైంది.

కళ్యాణలక్ష్మితోపాటు షాదీముబారక్ పథకాల్లో జరిగిన అవినీతిని పూర్తిస్థాయిలో వెలికితీసేందుకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. కళ్యాణలక్ష్మి పథకం కోసం నేరెడిగొండ, బజార్‌హత్నూర్, బోథ్, గుడిహత్నూర్, మావల మండలాల పరిధిలో 111 మంది బినామీ లబ్దిదారులు అధికారుల కన్నుగప్పి కళ్యాణలక్ష్మి సాయం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు విచారణలో తేలింది. వీరిలో 87 మంది బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు వెల్లడైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మండలాలవారీగా 2019 నుంచి మంజూరైన కళ్యాణలక్ష్మి అర్హులు, అనర్హుల జాబితాను సిద్ధం చేస్తోంది.

పథకంలో జరిగిన అక్రమాలను బయట పెట్టేందుకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు రంగంలోకి దిగి ఆదిలాబాద్ ఆర్డీవో కార్యాలయంతో పాటు ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్ మండలాల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు విచారణ ప్రారంభించారు. కళ్యాణలక్ష్మి పథకంలో అవినీతికి పాల్పడ్డవారిలో అచ్యుత్, శ్రీనివాస్ జాదవ్, నరేందర్ సహా మిస్టర్ ఎం, మిస్టర్ కే అనే మరో ఇద్దరు ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఈక్రమంలో బ్యాంకు ఖాతాలో పూర్తి పేరు లేకుండా రెండు ఖాతాల్లో నగదు జమ అయినట్లు అధికారులు వివరించారు. ప్రింటింగ్ సమస్యా, పూర్తి పేరు నమోదు చేయలేదా అని అధికారులు విచారణ జరుపుతున్నారు.

వీరికి సహకరించినవారెవరు?ఇప్పటిదాకా మంజూరైన 111 మందిలో నలుగురు వ్యక్తులు లక్షా 116 చొప్పున ఐదుసార్లు, మరో 13 మంది మూడుసార్లు లబ్దిపొందినట్లు తేలింది. వీరందరికీ సహకరించినవారెవరన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. కాగా 2019,20-20 ఆర్థిక సంవత్సరంలో దళారుల పాత్ర ఏమిటనేదానిపై అధికారులు దృష్టి సారించనున్నారు. ప్రభుత్వం కళ్యాణలక్ష్మి ప్రారంభించినప్పటి నుంచి విచారణ జరపాలని స్థానిక నేతలు కోరుతున్నారు. అక్రమాల్లో దళారుల పాత్రను తెలుసుకునేందుకు బినామీ లబ్ధిదారులందరిపైనా కేసులు నమోదు చేయాలని కోరుతూ రెవెన్యూ అధికారులు ఆదిలాబాద్, ఉట్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News