Thursday, May 2, 2024

3 నెలల పాటు అద్దె వసూలు చేయవద్దు.. ఉత్తర్వులు జారీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మూడు నెలల పాటు అద్దె వసూలు చేయరాదని పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి నుండి మూడు నెలల పాటు అద్దె వసూలు చేయవద్దని స్పష్టం చేసింది. అద్దె వసూలు చేయనందుకు ఎలాంటి వడ్డీ కూడా అడగరాదని సదరు ఉత్తర్వులలో పేర్కొంది. మూడు నెలల తర్వాత బకాయిలను వాయిదాల్లో తీసుకోవాలని ఆదేశించింది. అద్దెలు ఇవ్వనివారిని వేధించటం, ఖాళీ చేయించవద్దని పేర్కొంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, పురపాలిక కమిషనర్లకు అధికారాలు అప్పగించింది. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించినవారిపై అంటువ్యాధుల చట్టం1897, విపత్తు నిర్వహణ చట్టం2005 కింద చర్యలు తీసుకుంటామని పురపాలిక శాఖ స్పష్టం చేసింది.

TS Govt Issued orders to defer rent for 3 months

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News