Thursday, May 2, 2024

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

TS High Court Green Signal for Non-Agricultural Registrations

హైదరాబాద్: ధరణి పోర్టల్ లో వ్యవసాయేతర ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిజిస్ట్రేషన్ల కోసం ముందుగా స్టాట్ బుక్ చేసుకోవాలని ఆదేశించింది. ఆస్తిపన్ను, గుర్తింపు సంఖ్య కచ్చితంగా ఉండాలన్న నిబంధనకు హైకోర్టు అంగీకారం తెలిపింది. ధరణి పోర్టల్ పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. రిజిస్ట్రేషన్లపై స్టే ఇవ్వలేమని మరోసారి స్పష్టం చేసిన హైకోర్టు పాత పద్దతిలో రిజిస్ట్రేషన్ చేస్తే అభ్యతరం లేదని తెలిపింది. గతంలో రిజిస్ట్రేషన్ సిఎఆర్ డి పద్ధతిలో జరిగాయని పిటిషన్ తరుపు లాయర్ వెల్లడించారు. రిజిస్ట్రేషన్ కు ప్రాపర్టీ ట్యాక్స్, గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలని ఎజి తెలిపారు. ఆధార్ కార్డు, ధరణిలో ఎంట్రీ వివరాలు అడగొద్దని పిటిషన్ తరుపు న్యాయవాది వివరించారు. నాన్ అగ్రికల్చర్ ఆస్తులను ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయొచ్చన్న హైకోర్టు ధరణిపై మాత్రం ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 16 వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News