Saturday, April 27, 2024

జూన్ 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఇంటర్మీడియేట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. జూన్ 5 నుంచి 9 వరకు ఇంటర్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం పరీక్షలు,మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి.

జూన్ 21వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నైతికత, మానవ విలువల పరీక్ష, జూన్ 22వ తేదీన పర్యావరణ విద్యపై పరీక్షలు ఉంటాయి. ఇంటర్ ఒకేషనల్ కోర్సులకు ప్రత్యేకంగా షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 19వ తేదీ వరకు ఇంటర్ బోర్డు పొడిగించిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News