Wednesday, May 1, 2024

ఎస్‌ఐ, ఎఎస్‌ఐ ప్రిలిమినరీ కీ విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ లెవల్ రిక్రూట్‌మెంట్ బోర్డు(టిఎస్‌ఎల్‌పిఆర్‌బి) ఇటీవల నిర్వహించిన ఎస్‌ఐ (సివిల్, ఐటి అండ్ సిఒ, పిటిఒ) తత్సమాన పోస్టులు, ఎఎస్‌ఐ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షల ఫలితాల ‘కీ’ ని శనివారం నుంచి www.tslprb.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8, 9 తేదీల్లో ఆర్థమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లిష్, జనరల్ స్టడీస్, తెలుగు, ఉర్దూ, రెండు నాన్ టెక్నికల్ పేపర్లకు సంబంధించిన పరీక్షలను మూడు జిల్లాల్లో 81 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన విషయం విదితమే.

Also Read: కేంద్రంలో బిఆర్‌ఎస్ అధికారం ఈ శతాబ్దపు జోక్ : బండి

ఇందులో ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీని 15న ఉదయం నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. వీటికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి 17వ తేదీ వరకు వెబ్‌సైట్ ద్వారా స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను డాక్యుమెంట్, పిడిఎఫ్, జెపిజి రూపంలో వెబ్‌సైట్‌లో సమర్పించవచ్చు. అందుకు సంబంధించిన ప్రొఫార్మాను తమ వ్యక్తిగత లాగిన్‌లో అందుబాటులో ఉంచినట్లు బోర్డు చైర్మన్ పేర్కొన్నారు. ఫైనల్ కీని విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల ఒఎమ్మార్ షీట్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. మిగతా పేపర్లకు సంబంధించిన ప్రిలిమినరీ కీ వివరాలను ప్రెస్‌నోట్ ద్వారా విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News