Tuesday, April 30, 2024

ఆర్‌టిసిలో 813 కారుణ్య నియామకాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : టిఎస్ ఆర్‌టిసిలో ఆ పని చేస్తూ విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని ఆర్‌టిసి అధికారులను రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు.10 సంవత్సరాలుగా కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న సుమారు 813 మందికి కండక్టర్లుగా తీసుకోనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ (66), సికింద్రాబాద్ (126). రంగారెడ్డి (52), నల్గొండ (56), మహబూబ్‌నగర్ (83), మెదక్ (93), వరంగల్ (99), ఖమ్మం (53),

అదిలాబాద్ (71), నిజామాబాద్ (69), కరీంనగర్ (45) రీజియన్ల నుంచి మొత్తం 813 కండక్టర్ పోస్టులను సంస్థ భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కార్మికుల పక్షానే ఉంటుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.బెడ్ విన్నర్ (కారణ్య నియామకాలు), మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీమ్ కింద ఉద్యోగుల జీవిత భాగస్వామి/పిల్లలకు ప్రత్యామ్నాయ ఉపాధిని అందించడానికి వారి విద్యార్హతల ప్రకారం ఉద్యోగాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. మంత్రి నిర్ణయంతో అనేక సంవత్సరాలుగా కారుణ్య నియామకాలకోసం ఎదురుచూస్తు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను న్యాయం జరిగినట్లియ్యింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News