Wednesday, May 8, 2024

రేపు టెట్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో టీచర్ అభ్యర్థులకు శుక్రవారం(సెప్టెంబర్ 15) ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టిఎస్ టెట్) పరీక్ష జరుగనుంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్న టెట్ పరీక్ష కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. టెట్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి పాఠశాలలు, కళాశాలలకు ఒకటిన్నర రోజు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. గురువారం(సెప్టెంబర్ 14) మధ్యాహ్నం (ఆఫ్టర్‌నూన్) సెలవు ఇవ్వగా.. పరీక్ష రోజైన శుక్రవారం(సెప్టెంబర్ 15) సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా టెట్ పేపర్-1కు 2,69,557 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఈ పరీక్ష కోసం 1,139 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

అలాగే పేపర్-2కు 2,08,498 మంది దరఖాస్తు చేసుకోగా, ఈ పరీక్ష కోసం 913 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్ -1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్- 2 పరీక్ష జరగనుంది. టెట్ పరీక్ష కోసం 2,052 మంది ఛీఫ్ సూపరింటెండెంట్లను, 2,052 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులను, 22,572 మంది ఇన్విలేజర్లను,10,260 మంది హాల్ సూపరింటెండెంట్లను నియమించారు. అలాగే చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకు వైద్య సహాయం అందించేందుకు ఎఎన్‌ఎంలను నియమించడంతో పాటు పరీక్ష రోజు ఆర్‌టిసి ప్రత్యేక బస్సులు నడుపనుంది.

అభ్యర్థులకు సూచనలు
-టెట్ పరీక్ష పేపర్-1 ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. పేపర్-2 మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకూ ఉంటుంది.

అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఒకరోజు ముందు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని చూసుకోవడం ఉత్తమం.

-పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫోన్లు హాలులోకి అనుమతించరు.

–బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తోనే ఓఎంఆర్ షీట్‌ను నింపాలి.

–అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు రెండు బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులు తెచ్చుకోవాలి

—పరీక్ష సమయం ముగిసిన తర్వాతే అభ్యర్థి పరీక్షా హాలు నుంచి బయటకు పంపిస్తారు.

—ఓఎంఆర్ షీట్‌ను మడత పెట్టడం, ముడతలు పడేలా చేయడం, బార్ కోడ్‌ను ట్యాంపర్ చేయడం వంటివి చేయకూడదు.

టెట్‌కు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత పూర్తి వివరాలను సరిచూసుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News