Friday, March 29, 2024

టిటిడి బడ్జెట్ @ రూ.4411 కోట్లు: వైవి సుబ్బారెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమల తిరుపతిలో శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం కార్యక్రమం జరిగింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని, గత నెల 15న జరిగిన టిటిడి పాలక మండలిలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. ఎన్నికల కోడ్ వల్ల నిర్ణయాలను బహిర్గతం చేయలేకపోతున్నామన్నారు. 2023-24కి రూ.4411 కోట్ల అంచనాతో బడ్జెట్‌కు ఆమోదం తెలిపామని, టిటిడి బడ్జెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైవి సుబ్బారెడ్డి గుర్తు చేశారు.

హుండీల ద్వారా రూ 1591 కోట్ల ఆదాయం, వడ్డీల ద్వారా రూ.990 కోట్ల ఆదాయం, ప్రసాదాల ద్వారా రూ.500 కోట్ల ఆదాయం, దర్శన టికెట్ల ద్వారా రూ.330 కోట్ల ఆదాయం అంచనా వేశామన్నారు. భక్తుల సౌకర్యార్థం రూ.5.25 కోట్లతో అదనపు లడ్డూ కౌంటర్లు తెరిచామని, తమిళనాడులో ఉల్లందూరుపేటలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి అదనంగా రూ.4 కోట్లు ఇచ్చామని సుబ్బారెడ్డి తెలిపారు. ఎస్‌జిఎస్ ఆర్ట్ కళాశాలలో అదనపు భవన నిర్మాణాలకు రూ.4.71 కోట్లు విడుదల చేశామని వివరించారు. ఏప్రిల్ చివరి నాటికి శ్రీనివాస సేతు ప్రారంభిస్తామన్నారు. ఆన్‌లైన్ సేవలను ఇకపై నిరంతరంగా కొనసాగిస్తామని, డిసెంబర్ నాటికి చిన్న పిల్లల ఆస్పత్రిని ప్రారంభిస్తామన్నారు. ఏప్రిల్ 5న ఒంటిమిట్టలో రాములవారి కల్యాణం జరుగుతుందని, ఎపి ప్రభుత్వం తరపున సిఎం జగన్ పట్టు వస్త్రాల సమర్పిస్తారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News