Friday, May 3, 2024

చవితి నాడు ‘టక్ జగదీష్’ అదిరిపోతుంది

- Advertisement -
- Advertisement -

Tuck Jagadish trailer release

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ’టక్ జగదీష్’ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందింది. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈనెల 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ మేరకు తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్రయూనిట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాని, రీతూ వర్మ, శివ నిర్వాణ, ప్రవీణ్, తిరువీర్, సాహు గారపాటి, హరీష్ పెద్ది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ “ఫ్యామిలీ ఎమోషన్సే శివ నిర్వాణ బలం. నిన్నుకోరి, మజిలి సినిమాలను చూస్తే ఆ విషయం తెలుస్తుంది. ఆ రెండు సినిమాల్లో ఇద్దరి, ముగ్గురు మధ్యే ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఈ సారి ‘టక్ జగదీష్’లో మాత్రం చాలా మంది మధ్య ఎమోషన్స్ చూపించేశారు. ఇది మన ఇంటి సినిమా”అని అన్నారు. చిత్ర దర్శకుడు శివనిర్వాణ మాట్లాడుతూ “మా సినిమా అమెజాన్ ద్వారా ప్రతీ ఊర్లోకి వెళ్తోంది. వినాయక చవితి నాడు మా సినిమాను ఊర్లో వాళ్లు కూడా చూస్తారు. చవితి నాడు ‘టక్ జగదీష్’ అదిరిపోతుంది”అని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News