Sunday, April 28, 2024

పదేళ్ల తర్వాత మళ్లీ ప్రారంభమైన పాక్, ఇరాన్, టర్కీ గూడ్స్‌రైలు సర్వీస్

- Advertisement -
- Advertisement -

Turkey-Iran-Pakistan cargo train restarts after 10-year

ఇస్లామాబాద్ : గత పదేళ్లుగా రద్దయిన పాక్, ఇరాన్, టర్కీ గూడ్స్‌రైలు సర్వీస్ మళ్లీ ప్రారంభమైంది. దీంతో ఈ మూడు దేశాల మధ్య ప్రాంతీయ అనుసంధానం, వాణిజ్య సామర్ధం పెంపొందుతుందని భావిస్తున్నారు. ఇదే రూటులో ప్యాసింజర్ రైలు సర్వీస్‌ను కూడా భవిష్యత్తులో ప్రవేశ పెట్టడానికి మూడు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. పాక్ రైల్వే మంత్రి ఆజం ఖాన్ స్వాతి, విదేశీ వ్యవహారాల మంత్రి షా మొహమూద్ ఖురేషి, ప్రధాని సలహాదారు ( వాణిజ్యం)అబ్దుల్ రజాక్ దావూద్, ఈ గూడ్సురైలు సర్వీస్‌ను మంగళవారం ప్రారంభించారు. టర్కీ, ఇరాన్, కజకిస్థాన్ , ఉజెబికిస్థాన్ దేశాల దౌత్య ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి మంగళవారం నడిచే ఈ గూడ్సురైలు ఇస్లామాబాద్ లోని మార్గల్లా రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి, ఇరాన్ లోని జహెదాన్‌కు చేరుకుంటుంది. అక్కడ నుంచి ఇస్తాన్‌బుల్ మీదుగా బయలుదేరుతుంది. 2009 ఆగస్టు 14 న మొట్టమొదటి సారిగా ఈగూడ్సురైలు ఇస్లామాబాద్ నుంచి ఇస్తాన్‌బుల్ కు ప్రయాణించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News