Sunday, April 28, 2024

బూస్టర్ డోసులు ఎప్పుడు ప్రారంభిస్తారు ?

- Advertisement -
- Advertisement -

When will booster shots start Asks Rahul Gandhi

కేంద్రాన్ని ప్రశ్నించిన రాహుల్

న్యూఢిల్లీ : దేశంలో ఇంకా చాలా మందికి వ్యాక్సిన్ అందలేదని, థర్డ్ వేవ్‌ను ఎదుర్కోవాలంటే కనీసం 60 శాతం మందికి వ్యాక్సిన్ అందించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు కేవలం 42 శాతం మందికే పూర్తి మోతాదులో వ్యాక్సిన్ చేరిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో బూస్టర్ డోసు పంపిణీ ఎప్పుడు మొదలు పెడతారని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. థర్డ్ వేవ్‌ను ఎదుర్కోవాలంటే డిసెంబరు 2021 నాటికి 60 శాతం మందికి రెండు డోసులు ఇవ్వాలనేది లక్షం అయినా ప్రస్తుతం రోజుకు 58 లక్షల డోసులు మాత్రమే పంపిణీ జరుగుతోందని ఆయన వివరించారు. ఈమేరకు డిసెంబర్ చివరినాటికి కేవలం 42 శాతం మందికి మాత్రమే పూర్తి మోతాదులో వ్యాక్సిన్ అందించగలమని చెప్పారు. డిసెంబర్ లక్షాన్ని చేరుకోవడం సాధ్యమయ్యేలా కనిపించని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం బూస్టర్ డోసును ఎప్పుడు ప్రారంభిస్తుందని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News