Sunday, May 5, 2024

దివ్యాంగుడిపై జవాన్ల దాడి..

- Advertisement -
- Advertisement -

లక్నో : చేతులు కడుక్కోడానికి నీళ్లు అడిగిన దివ్యాంగుడిపై ఇద్దరు జవాన్లు తీవ్రంగా దుర్భాషలాడుతూ దాడి చేశారు. ఉత్తరప్రదేశ్ లోని డియోరియా జిల్లాలో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఇది వీడియోలో వైరల్ కావడంతో ఆ జవాన్లను ఉన్నతాధికారులు ఉద్యోగాల నుంచి తొలగించారు. బాధితుడు 26 ఏళ్ల సచిన్‌సింగ్‌కు ముంబైలో 2016లో రైలు ప్రమాదంలో రెండు కాళ్లు పోయాయి. ఆయన సిమ్ కార్డులు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. , రెస్టారెంట్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.

శనివారం రాత్రి బాగా పొద్దుపోయిన తరువాత భోజనం చేసి తన మూడు చక్రాల సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా, దారిలో రోడ్డుపై తాబేలు కనిపించింది. దాన్ని పట్టుకుని దగ్గరలో దుగ్ధేశ్వర్‌నాథ్ ఆలయం వద్ద నున్న చెరువులో విడిచిపెట్టాడు. ఇంటికి వెళ్తూ దారిలో ఇద్దరు ప్రాంతీయ రక్షక్ దళ్ (పీఆర్‌డి) జవాన్లను చూసి చేతులు కడుక్కోడానికి నీళ్లు అడిగాడు. దీనికి జవాన్లు తీవ్ర ఆగ్రహంతో అతడిని దుర్భాషలాడుతూ కొట్టారు. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం సంచలనం కలిగించింది. పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లి దర్యాప్తు చేశారు. నిందితులు రాజేంద్ర మణి, అభిషేక్ సింగ్‌లను విధుల నుంచి తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News