Tuesday, August 5, 2025

దంపతుల మధ్య ఘర్షణ.. బావిలో దూకి ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

మోమిన్ పేట: వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలంలో ఓ విషాదం చోటుచేసుకుంది. చీమల్ దరి వద్ద అన్నా, చెల్లెలు బావిలో దూకి చనిపోయారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… చీమల్ దరి గ్రామంలోని ఓ వెంచర్ లో దంపతులు పని చేస్తున్నారు. దంపతుల మధ్య జరిగిన గొడవ తారాస్థాయికి చేరుకుంది. భర్తతో గొడవపడిన భార్య అలివేలు మనస్థాపానికి చెంది బావిలో దూకింది. భార్యను రక్షించాలని వెంటనే భర్త మాసయ్య బావిలో దూకాడు. అన్న, వదినను మునిగిపోవటం చూసి వారిని రక్షించేందుకు నాగమ్మ బావిలో దూకింది. బావిలో పడిన ముగ్గురిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. మొదట బావిలో దూకిన భార్య అలివేలు పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మాసయ్య, చెల్లెలు నాగమ్మ మృతి చెందారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News