Thursday, May 2, 2024

బీహార్‌లో కూలిన మరో వంతెన

- Advertisement -
- Advertisement -

పాట్నా : బీహార్ లోని వైశాలి జిల్లాలో గంగానదిపై నిర్మించిన తాత్కాలిక వంతెన లోని కొంతభాగం బుధవారం కూలిపోయింది. బలమైన గాలుల కారణంగా కూలిపోయినట్టు అధికారులు తెలిపారు. ఆ సమయంలో వంతెన దాటుతున్న కొందరు చిక్కుకు పోయినట్టు చెప్పారు. జూన్ 20 నాటికి వంతెనను కూల్చివేయాల్సి ఉండగా, ఇంతలోనే కూలిపోయినట్టు చెప్పారు.

అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం ఏదీ జరగలేదని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈ నెల 4న ఈ రాష్ట్రంలో ఖగడియా జిల్లా భగల్‌పూర్‌లో గంగానదిపై నిర్మిస్తున్న వంతెన కూలిపోగా, ఆ తర్వాత కిషన్‌గంజ్ జిల్లాలో మెచ్చినదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలింది. తాజాగా గంగానదిపై తాత్కాలికంగా నిర్మిస్తున్న వంతెన కొంతభాగం కూలింది. నెల వ్యవధిలోనే మూడు ఘటనలు జరగడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News