Wednesday, May 15, 2024

ఉచిత బియ్యానికి బదులు డబ్బులు..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఐదు హామీల్లో ఒకటైన అన్నభాగ్య పథకం అమలుకు ఇబ్బందులు ఎదురు కావడంతో ఉచిత బియ్యానికి బదులుగా నగదు ఇస్తామని ప్రకటించింది. కిలోబియ్యానికి రూ. 34 చొప్పున ఐదు కిలోల బియ్యానికి సమానమైన డబ్బును బీపీఎల్ ఖాతాదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలిపింది. ఈమేరకు బుధవారం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాలను రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి కేహెచ్ మునియప్ప మీడియాకు వెల్లడించారు. “ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం కిలో బియ్యానికి ప్రామాణిక ధర రూ. 34 గా ఉంది.

ఈమేరకు బీపిఎల్ ఖాతాదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసేందుకు మే ప్రయత్నాలు చేశాం. కానీ ఏ సంస్థా ముందుకు రాలేదు. ఇక అన్న భాగ్య పథకాన్ని జులై 1 నుంచి ప్రారంభించాల్సి ఉంది. బియ్యం కొరత కారణంగా పథకం అమలును ఆపలేం. అందుకు సమానమైన డబ్బులు ఇవ్వనున్నాం. బియ్యం అందుబాటు లోకి వచ్చేవరకు కిలోబియ్యానికి రూ. 34 చొప్పున నగదు అందిస్తాం. జులై 1 నుంచి ఈ నగదు నేరుగా ఖాతాదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఒక రేషన్ కార్డులో ఒక వ్యక్తి ఉంటే నెలకు రూ. 170 వస్తాయి. అదే ఇద్దరైతే రూ. 340 , కుటుంబంలో ఐదుగురైతే నెలకు రూ. 850 జమ చేస్తామని మంత్రి వివరించారు.

Also Read: నదిలో బోల్తా పడిన పెళ్లి వాహనం…ఐదుగురు మృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News