Tuesday, May 7, 2024

అధికారం కోసం అమలు కానీ హామీలు

- Advertisement -
- Advertisement -

రాహుల్ ప్రధాని కోసం కాంగ్రెస్ అడ్డదారులు
బిసి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సిఎం చేస్తాం
గద్వాల్, నల్లగొండ, వరంగల్ సభల్లో కేంద్ర మంత్రి అమిత్ షా

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి బిజెపి పెద్దల క్యూ కడుతున్నారు. అందులో భాగంగా కేంద్ర మంత్రి అమిత్‌షా మూడు జిల్లాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలపై ధ్వజమెత్తారు. శనివారం ఉదయం 12 గంటల రాష్ట్రానికి వచ్చిన ఆయన నేరుగా గద్వాల్‌లో నిర్వహించిన సభకు వెళ్లి అక్కడ ముగిసిన తరువాత నల్లగొండ, వరంగల్ జిల్లాల సభకు వెళ్లి ఆయన ప్రసంగిస్తూ ఈసారి ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి అధికారం ఇస్తే ఇప్పటివరకు పాలించిన పార్టీల కంటే తాము మరింత అభివృద్ది చూపించి దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ స్ధానంలో నిలబెడుతామని పేర్కొన్నారు.

సంక్షేమ పథకాల పేరుతో కొన్ని పార్టీలు రాష్ట్రాన్ని నిలువునా దోచుకునేందుకు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. మరోవైపు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు సోనియా విశ్వ ప్రయత్నాలు చేస్తోందని పదవి కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధమయ్యారని అందుకే అమలుకు సాధ్యం కానీ హామీలను గుప్పిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, మజ్లిస్ రెండు కుటుంబ పార్టీలేనని ఈఎన్నికలో వాటిని మట్టికరిపించాలని కోరారు. మోడీ సుపరిపాలన- కాంగ్రెస్ అవినీతి పాలనకు మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఓబీసీ, ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతామని సంచలన హామీ ఇచ్చారు. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News