Sunday, April 28, 2024

జూన్ 30వరకు పబ్లిక్ మీటింగ్‌లు బంద్..

- Advertisement -
- Advertisement -

yogi

లక్నోః కరోనా వైరస్(కోవిడ్-19) విజృంభిస్తున్న నేపథ్యంలో యూపి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జూన్ 30వ తేదీ వరకు ఎలాంటి పబ్లిక్ మీటింగ్‌లకు అనుమతి ఇవ్వొద్దని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యతనాథ్ అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. కాగా, యుపిలో కరోనా పాజిటీవ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు యుపిలో మొత్తం 1,621 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి కోలుకొని 226 మంది డిశ్చర్జ్ అయ్యారు. ప్రస్తుతం యుపిలో 1,370 కరోనా ఆక్టీవ్ కేసులున్నాయి. మరోవైపు దేశంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 25వేలకు చేరువైంది. ఇక, కరోనా మరణాల సంఖ్య 782కు చేరకుంది.

UP Govt Bans Public Gatherings Till June 30

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News