Sunday, April 28, 2024

నేనేమీ బాధపడడం లేదు…యూపీ టీచర్

- Advertisement -
- Advertisement -

మతపరమైన వ్యాఖ్యలపై దుమారం

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ముజఫర్‌నగర్‌లోని ఓ ఉపాధ్యాయురాలు పాఠశాలలో చేసిన మతపరమైన వ్యాఖ్యలు, ఆమె ప్రవర్తనకు సంబంధించిన వీడియో దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై సదరు ఉపాధ్యాయురాలు స్పందించారు. తాను చేసిన పనికి ఏ మాత్రం బాధపడటం లేదని పేర్కొనడం గమనార్హం. సదరు మహిళ ఆ పాఠశాలకు ప్రధానోపాధ్యాయురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ “తాను పాఠశాల ప్రిన్సిపల్ రూపంలో గ్రామానికి సేవలందిస్తున్నాను. వారంతా నాతోనే ఉన్నారు. చట్టాలు ఉన్నాయి. కానీ పిల్లలను పాఠశాలలో నియంత్రించాల్సిన అవసరం ఉంది. అందుకు ఇలాంటి చర్యలే తీసుకోవాలి” అని తెలిపారు. పిల్లలను నియంత్రించడానికే అటువంటి చర్యలు తీసుకొన్నట్టు ఆమె సమర్థించుకున్నారు.

తొలుత , ఈ వీడియో వైరల్ అయిన సమయంలో ఆమె తన తప్పును అంగీకరించారు. ఇది చాలా చిన్న విషయమని, దీనిని పెద్దది చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తాను తప్పు చేశానని, కానీ అనవసరంగా ఇది పెద్ద విషయంగా మారిందని ఆ టీచర్ చెప్పారు. తాను దివ్యాంగురాలినని, అసైన్‌మెంట్ పూర్తి చేయకపోవడంతో విద్యార్థి వద్దకు వెళ్లలేక వేరే విద్యార్థులతో చెంపదెబ్బ వేయించానని పేర్కొన్నారు. ఈ ఘటనపై సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ ఇప్పటికే ఆ విద్యార్థి తల్లిదండ్రులతో టీచర్ మాట్లాడి, వారి బిడ్డ చదువుపై దృష్టి పెట్టాలని చెప్పినట్టు తేలిందన్నారు. సదరు టీచర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అరవింద్ మల్లప్ప బంగారి పేర్కొన్నారు. “ మేము ఆ విద్యార్థి తండ్రి ఫిర్యాదు ఆధారంగా టీచర్‌పై కేసు నమోదు చేశాం. శాఖాపరమైన చర్యలు తీసుకొంటాం.” అని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News