Tuesday, May 21, 2024

తగ్గిన ‘ఉపాధి హామీ’ రోజుల సంఖ్య..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: యాప్ ఆధారిత హాజరు వ్యవస్థను అమలు చేసిన తర్వాత ఉపాధిహామీ కూలీల పనిరోజుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో కూలీల వ్యక్తిగత పనిరోజుల సంఖ్య గత సంవత్సరాలతో పోలిస్తే తగ్గింది. సివిల్ సొసైటీ గ్రూప్ ఈమేరకు డేటాను వెల్లడించింది. ఉపాధి హామీ కూలీలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొత్త హాజరు విధానం, చెల్లింపు వ్యవస్థలకు వ్యతిరేకంగా నెలరోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కూలీల నిరసనకు నాయకత్వం వహిస్తున్న ఎన్‌ఆర్‌ఇజిఎ సంఘర్ష్ మోర్చా సేకరించిన డేటా ప్రకారం ఈ ఏడాది తొలి రెండు నెలల్లో 34.59కోట్ల మంది కూలీలు ఉపాధిహామీ పనుల్లో పాల్గొన్నారు.

ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో 34.59కోట్ల వ్యక్తిగత పనిదినాలు నమోదయ్యాయి. గతేడాది 2022 జనవరి, ఫిబ్రవరిలో 53.07కోట్ల మంది కూలీలకు సంబంధించిన పనిదినాలు నమోదవగా, అంతకుముందు 2021లో 56.94కోట్ల వ్యక్తిగత పనిదినాలు నమోదయ్యాయి. 2020 తొలి రెండు మాసాల్లో 47.75కోట్ల కూలీల పర్సనల్ డేస్ ఉండగా 2019అదేకాలానికి ఈసంఖ్య 47.86గా ఉంది. కాగా ఉపాధిహామీ కూలీలు జాతీయ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్‌ఎంఎంఎస్)ను నిరసిస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యల కారణంగా తమ హాజరును గుర్తించడం లేదని ఎన్‌ఎంఎంఎస్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు చాలామంది కార్మికులకు ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఎబిపిఎస్) ఖాతాలు లేవు. ఈ క్రమంలో ఎబిపిఎస్ వ్యవస్థను తప్పనిసరి చేయడంపై కూలీలు నిరసన చేస్తున్నారు. ఎన్‌ఆర్‌ఇజిఎ సంఘర్ష్ మోర్చా డేటా ప్రకారం ఫిబ్రవరి1నాటికి కూలీల్లో 40శాతంకంటే తక్కువమంది ఎబిపిఎస్ చెల్లింపులకు అర్హులుగా నమోదయ్యారు. కాగా మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ లేదా ఎన్‌ఆర్‌ఇజిఎగా ప్రతి ఇంటికి ఆర్థిక సంవత్సరంలో కనీసం 100రోజుల ఉపాధిని అందించడం, గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల జీవనోపాధి భద్రతను పెంపొందించడం లక్షంగా పథకాన్ని రూపొందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News