Thursday, May 2, 2024

ఉర్దూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో… నేడు రవీంద్రభారతిలో ముషాయిరా, కవి సమ్మేళనం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ఉర్దూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 21న రవీంధ్ర భారతిలో ముషాయిరా.., కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆరిఫుద్దీన్ అహమద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి, వక్ఫ్‌బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, తొమ్మిదో నిజాం ప్రిన్స్ రౌనఖ్ యార్ ఖాన్ సీనియర్ కాంగ్రెస్ నేత ఖలీఖ్ ఉర్ రహమాన్, సమాచార, పౌరసంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ జగన్, టిఎన్‌జిఓస్ నాయకులు డా. హుస్సేనీ ముజీబ్ తదితరులు పాల్గొంటున్నట్లు తెలిపారు.

‘జాతీయ సమగ్రత’ అనే అంశంపై సాయంత్రం 4 గం.ల నుండి రాత్రి 10 గం.ల వరకు ముషాయిరా, కవి సమ్మేళనం ఉంటుందన్నారు. అంతకు ముందు మధ్యాహ్నం 2గం.ల నుండి 3.30 గంటల వరకు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘బోధన భాషగా మాతృభాష’ అనే అంశంపై హై స్కూల్ విద్యార్థులకు, మాతృభాష ప్రాధాన్యత అంశంపై జూనియర్ కాలేజీ విద్యార్థులకు, మాతృభాష, రాజ్యాంగ హక్కులు అంశంపై డిగ్రీ విద్యార్థులకు, మాతృభాషాభివృద్ధిలో జర్నలిజం పాత్ర అనే అంశంపై పిజి విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఉపన్యాసం పోటీలు ఉంటాయి. పై అంశాలపై ఉర్దూ,తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఉపన్యాసంలో పోటీలు ఉంటాయని ఇందులో పాల్గొనే విద్యార్థులు గంట ముందు విద్యా సంస్థల ఐడి కార్డు, లేదా బోనఫైడ్ సర్టిఫికెట్‌తో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9700758178 నెంబర్‌కు సంప్రదించవచ్చని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News