Monday, May 6, 2024

25న హజ్ యాత్రికుల తొలి శిక్షణా శిబిరం

- Advertisement -
- Advertisement -

ముఖ్యఅతిథిగా ముహమ్మద్ అలీ షబ్బీర్

మన తెలంగాణ / హైదరాబాద్ : ఈ ఏడాది హజ్‌కు ఉద్దేశించిన హజ్ యాత్రికుల మొదటి హజ్ శిక్షణ శిబిరం ఈ నెల 25న ఆదివారం జరుగనుంది. పాత మలక్‌పేట్‌లోని న్యూ వాహెద్‌నగర్, మూసారాంబాగ్ రోడ్డులోని హైటెక్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఉదయం 10 గం.ల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ శిక్షణా శిబిరం జరుగుతుందని రాష్ట్ర హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ అధికారి షేక్ లియాఖత్ హుస్సేన్ తెలిపారు. హజ్ యాత్రికులందరూ ఈ శిక్షణా శిబిరానికి సమయానికి హాజరు కావాలని కోరారు.

ఈ శిక్షణా శిబిరాన్ని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ సంక్షేమం సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ప్రారంభిస్తారని తెలిపారు. మత పండితులు మనాసిక్-ఎ-హజ్, జియారత్-ఎ-మదీనా మునవ్వరా పై మాట్లాడుతారని, ముఖ్యమైన లాజిస్టిక్ ఏర్పాట్లు, హజ్ యాత్ర సన్నాహాల గురించి అధికారులు వివరిస్తారని తెలిపారు. హైటెక్ గార్డెన్ ఫంక్షన్ హాల్ పక్కన, అల్ ఫంక్షన్ హాల్ వద్ద మహిళా హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హజ్ యాత్రికులు హజ్ శిక్షణా శిబిరాల సమయంలో మైనర్ పిల్లలను తమ వెంట తీసుకురావద్దని అభ్యర్థించారు. హజ్ యాత్రికులు హజ్ శిక్షణా శిబిరంలో ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకోవడానికి నోట్ పుస్తకం, పెన్ను తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం, 040-23298793 నెంబర్‌కు సంప్రదించవచ్చని లేదా నాంపల్లిలోని రాష్ట్ర హజ్ కమిటీ కార్యాలయంలో వ్యక్తిగతంగా సంప్రదించవచ్చని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News