Sunday, April 28, 2024

హెచ్1 బి వీసా పేరిట తక్కువ వేతనాలు

- Advertisement -
- Advertisement -

H-1B

 

వాషింగ్టన్: అమెరికాలో అత్యంత ప్రముఖ కంపెనీలు హెచ్ 1 బి వీసాదారులకు మార్కెట్ స్థాయి కన్నా తక్కువ వేతనాలు చెల్లిస్తున్నాయి. అమెరికాలోని ఫేస్‌బుక్,గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ సంస్థలతో పాటు పలు కంపెనీలు హెచ్ 1 బి వీసా ప్రోగ్రాంను వాడుకుంటున్నాయి. ఈ సంస్థలు తాత్కాలిక పనుల వీసా పద్ధతిలో విదేశాల నుంచి ఉద్యోగులను తీసుకుంటున్నాయి. ఈ వీసా పద్ధతిలో ఉద్యోగులకు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నాయి. ఈ హెచ్ 1బి వీసాను నాన్ ఇమ్మిగ్రేంట్ వీసాగా పరిగణిస్తారు. దీనిని ప్రాతిపదికగా చేసుకుని అమెరికా కంపెనీలు ఇండియా, చైనా నుంచి అతి ఎక్కువగా సాంకేతిక నిపుణులను ఉద్యోగాలలోకి తీసుకుంటున్నాయి.

ఈ హెచ్ 1 బి వీసా పరిధిలో అమెరికాలో దాదాపు 5 లక్షల మంది వలస ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ విధంగా అమెరికాలో ప్రముఖమైన 30 హెచ్ 1 బి ఎంప్లాయిర్స్‌లో అమేజాన్, మైక్రోసాఫ్ట్, వాల్‌మార్ట్, గూగుల్, యాపిల్ వంటి పలు సంస్థలు ఉన్నాయి. ప్రతిభావంతులను ఈ వీసా పరిధిలో ఉద్యోగాలలోకి తీసుకుని ఆయా కంపెనీలు వారికి స్థానిక మధ్యస్థ వేతనాల కన్నా తక్కువ వేతనాలు చెల్లిస్తూ వస్తున్నాయని, ఈ వీసా ప్రోగ్రాంలోని నిబంధనలను తమకు అనుకూలంగా మల్చుకుంటున్నాయని ఎకనామిక్ పాలసీ ఇనిస్టూట్ విడుదల చేసిన నివేదికలో తెలిపారు. హెచ్1బి వీసాలు, ప్రస్తుత వేతన స్థాయిలు అనే శీర్షికతో ఈ నివేదికను విడుదల చేశారు. హెచ్ 1 బి వీసా పరిధిలో ఉద్యోగాలు పొందిన వారిలో 60శాతం వరకూ ఉద్యోగులకు మార్కెట్లో ఇదే స్థాయి ఉద్యోగాలు చేసే వారి జీతాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటున్నాయని వెల్లడించారు.

use H-1B visa to pay low wages to migrant workers
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News