Thursday, May 2, 2024

మహారాష్ట్ర‌ నుంచి 68 మంది విద్యార్థినులను తెలంగాణ చేర్చిన కవిత

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/హైదరాబాద్: లాక్‌డౌన్‌తో మహారాష్ట్ర సోలాపూర్‌లో చిక్కుబడ్డ మహిళలు మాజీ ఎంపి, జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చొరవతో బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 68 మంది మహిళలు లాక్‌డౌన్ కారణంగా సోలాపూర్‌లో చిక్కుకు పోయారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ మహిళలను తిరిగి వారి సొంత ఊరికి పంపించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. అయితే వారికి ఒక ప్రైవేటు కళాశాలలో వసతి ఏర్పాటు చేశారు. 23 రోజులుగా ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడ్డారు. పూర్తి స్థాయి సౌకర్యాలు కరవై సొంత రాష్ట్రానికి వెళ్లలేక తీవ్రం ఇబ్బందులు పడిన వారంతా తమ సమస్యలను ట్విట్టర్ ద్వారా మాజీ ఎంపి కవితకు తెలిపారు. దాంతో తక్షణం స్పందించిన కవిత మహారాష్ట్ర, తెలంగాణ అధికారులతో సంప్రదింపులు జరిపి మూడు ప్రత్యేక బస్సుల్లో భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసి సొంతరాష్ట్రానికి రప్పించారు. వీరంతా బుధవారం సాయంత్రం స్వస్థలాలకు చేరుకున్నారు. ఈ మహిళలు ఇళ్లలోనే క్వారంటైన్‌లో ఉండే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ లాక్‌డౌన్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్నామని సొంతరాష్ట్రానికి వస్తామా అనే సందేహంతో కాలం గడిపామని చెప్పారు. మాజీ ఎంపి కవితకు సమాచారం అందించగానే ఇక్కడకు వచ్చేలా రవాణా ఏర్పాట్లు చేశారని చెప్పారు. తక్షణం స్పందించిన కవితక్కకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

సోలాపూర్ నుంచి వచ్చిన 68 మంది విద్యార్థినులు హోం క్వారంటైన్‌కు:
మూడు మాసాల క్రితం సోలాపూర్‌కు వెళ్లిన అగ్రికల్చర్ పరిశోధనా విద్యార్థినులు జాగృతి అధ్యక్షురాలు కవిత చొరవతో తెలంగాణలోని తమ తమ సొంత జిల్లాలకు వెళ్లారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం బార్డర్ దాటాక వీరందరికి చేతిపై హోం క్వారంటైన్‌లో ఉండాలని తెలంగాణ ప్రభుత్వ అధికారులు ముద్ర వేసారు. ఈ విద్యార్థినులందరూ ఇళ్లకు వెళ్లినా హోం క్వారంటైన్‌లో ఉండనున్నారు.

68 Students Reached to Telangana from Maharashtra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News