Saturday, April 27, 2024

అప్పటి వేరియంట్ ఇప్పుడు కొంపముంచింది

- Advertisement -
- Advertisement -

Variant accelerating India's Covid-19 explosion: Soumya Swaminathan

అక్టోబర్‌లోనే ఆనవాళ్లు
అజాగ్రత్తలు సమ్మేళనాలతో ముప్పు
భారత్‌లో కరోనా స్పీడ్‌వేవ్
అత్యంత సంక్లిష్టం
ప్రపంచ ఆరోగ్యసంస్థ సైంటిస్టు సౌమ్య

న్యూయార్క్ : భారతదేశంలో కరోనా కొత్త వేరియంట్లు తీవ్రస్థాయి ఆరోగ్య విషమపరిస్థితిని సృష్టిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ తెలిపారు. వివిధ ప్రాంతాలలో కొత్త రకం వైరస్ శీఘ్రగతిన వ్యాపిస్తోందని, ఈ దశలో అత్యధిక సంఖ్యలో వ్యాక్సిన్లు పొందడం ద్వారా ప్రజలకు కొవిడ్ నుంచి రక్షణ ఏర్పడుతుందని తెలిపారు. భారత్ ఇప్పుడు మరింతగా వ్యాక్సిన్ల వెతుకులాటకు దిగాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆరోగ్యసంస్థలో ఆరోగ్య విషయాలపై సౌమ్య కీలక బాధ్యతలలో ఉన్నారు. ఇప్పుడు నెలకొన్న సంక్రమణల దశ , దీని స్వరూపం, పరిస్థితి అదుపులోకి రాకపోవడం ఇవన్నీ పరిశీలిస్తే మునుపటి వేరియంట్ కాకుండా సరికొత్త వేరియంట్లతోనే ఇండియాలో కరోనా వేగవంతంగా విస్తరిస్తోందని, ఇది ప్రమాదకర పరిణామం అన్నారు. ఇండియాలో ఒక్కరోజు వ్యవధిలో నాలుగు లక్షలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదు కావడం, 4వేల మందికి పైగా కరోనా తీవ్రతతో మృతి చెందడం వంటి పరిణామాలు జరిగాయి.

ఇప్పుడు ఇండియాలోని అత్యంత కీలకమైన పటిష్టమైన ఆరోగ్య చికిత్సా వ్యవస్థపై ఇప్పటి వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయిలో ఒత్తిడిని తెచ్చిపెడుతోంది. పలు చోట్ల ఆసుపత్రులలో మరణాలు కలవరానికి దారితీస్తున్నాయి. పైగా సరైన వైద్య సిబ్బంది లేకపోవడం, వైద్య సిబ్బంది చికిత్స సామర్థానికి మించి కరోనా రోగులు ఆసుపత్రుల్లో చేరాల్సి రావడం వంటి పరిణామాలు ఆందోళనకరం అయ్యాయని తెలిపారు. దేశంలో కొవిడ్ మరణాలు, కొత్త కేసులపై అధికారిక గణాంకాలు వాస్తవికంగా లేవని, అతి తక్కువగా చూపుతున్నారని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న విషయాన్ని సౌమ్య ప్రస్తావించారు. వ్యత్యాసం ఉన్నట్లు అయితే పరిస్థితి మరింత దారుణం అవుతుందని హెచ్చరించారు. ఇండియన్ పీడియాట్రిషియన్, క్లినికల్ సైంటిస్టు అయిన సౌమ్య ఐరాస ఆరోగ్య సంస్థలో కీలక భూమిక పోషిస్తున్నారు. కొవిడ్ 19 రూపాంతరం చెంది ఇప్పుడు తలెత్తిన బి .1.617వేరియంట్ ఇండియాలో నిజానికి గత అక్టోబర్‌లోనే తలెత్తిందని ఇప్పుడు భారత్‌లో విస్తరిస్తూ భయకంపితం చేస్తోందని తెలిపారు. ఇప్పటివరకూ నిద్రాణంగా ఈ వేరియంటు ఉంటూ వచ్చింది.

ఇప్పుడు క్రమేపీ పలు కారణాలతో విజృంభించిందని , ఇది వేగవంతపు వ్యాప్తి లక్షణాలతో కూడిన రకం అని దీనితో రాబోయే రోజులలో దీనితో పలు విపరీత పరిణామాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. బి 1.617ను కరోనా వైరస్ రకాలలో అత్యంత భిన్నమైన రకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఇది ఓ పట్టాన చికిత్సకు లొంగకుండా ఉంటుంది. ఈ రకం వైరస్‌తో పలు రకాల ఇబ్బందులు ఏర్పడుతాయని నిపుణులు విశ్లేషిస్తున్న విషయాన్ని సౌమ్య తెలిపారు. ఇది వేగంగా వ్యాపించడం, తరువాత యాంటీబాడీస్‌ను కూడా లెక్కచేయకుండా శరీర కణజాలంలోకి చొచ్చుకుని పొయ్యే తత్వంతో ఉండటం, వ్యాక్సినేషన్‌తో తలెత్తే రోగనిరోధకతను కూడా దెబ్బతీసే సామర్థం పొంది ఉండటం వంటి పరిణామాలు ఆందోళనకరం అని, ఇండియాలో ఇప్పుడు ఇది విస్తరించడం ఎటువైపు దారితీసే పరిణామం అనేది తెలియకుండా పోతోందని తమ దేశపుపరిస్థితిపైఆందోళన వ్యక్తం చేశారు.

వేరియంట్లు చాలాకాలంగా వస్తూ పోతూ ఉంటాయి. అయితే వీటిని పనిగట్టుకునినిందించాల్సిన అవసరం లేదని, నిజానికి ఇంతకు ముందటి జాగ్రత్తలను వదిలిపెట్టడం , ప్రజలు ఎక్కువగా గుమికూడటం, సామూహిక జీవన స్థితిగతులు వీటితో పాటు సభలు సమావేశాలు వంటివి పరిస్థితిని దిగజార్చాయని, జనం ఎక్కువగా ఉండే దశలలో వ్యాపించే ఈ వేరియంటు అతి తేలికగా వ్యాపిస్తూ, అత్యధిక నష్టం కల్గిస్తుందని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News