Sunday, April 28, 2024

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహన డ్రైవర్లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/యాదాద్రి : యాదగిరిగుట్ట పట్టణ ట్రాఫిక్ పరిధిలో పోలీసులు చేసిన డ్రంకెన్ డ్రైవ్‌లో మద్యం సేవించి వాహనాలు నడుపుతు పట్టుబడ్డ డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సిఐ కె. శివశంకర్ తెలిపారు. మంగళవారం ఆయన వివరాలు తెలియ చేసిన ప్రకారం.. ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో రెండు మినీ బస్సులు, ఒక టాటా ఎసి వాహనము, ఒక ఆటో, కొన్ని ద్విచక్ర వాహనాల డ్రైవర్లు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డారు. వీరిపై సెక్షన్ 185(ఏ) యం.వి యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఆలేరు కోర్టులో వీరిని ప్రవేశ పెట్టడం జరుగుతుందని తెలిపారు. వాహనదారులు ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకొని మద్యం సేవించి వాహనాలు నడపడంపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ట్రాఫిక్ నిబధంనలు పాటించకుండా వాహనా దారులు డ్రైవింగ్ చేయడం వల్ల అనేకమంది తమ విలువైన ప్రణాలు ప్రమాదంకు గురై పోగొట్టు కుంటున్నరని ఎట్టి పరిష్థితిలో ట్రాఫిక్ నిబంధనలను నిర్లక్ష్యం చేయకుండా వాహనాలు నడపాలని లేని యెడల చట్టరీత్యచర్యలు తప్పవని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News