తేజాసజ్జా, మంచు మనోజ్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిరాయ్’ (Mirai Movie). యాక్షన్, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సెప్టెంబర్ 5వ తేదీన విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘వైబ్ ఉంది బేబి’ అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట కొంత యవతను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే థియేటర్‌కి వెళ్లిన జనాలకు మాత్రం నిరాశే మిగిలింది. ఈ పాట లేకుండానే సినిమాను ప్రదర్శించారు.
ఆసక్తికరంగా సాగే కథ, కథనాలకు ఈ పాట అడ్డు పడుతోందని తీసేసినట్లు దర్శకుడు కార్తీక్ తెలిపారు. అయితే పాట ఉంటే బాగుండేది అని ప్రేక్షకుల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో పాటను మళ్లీ చిత్రంతో జత చేస్తున్నారు. మంగళవారం నుంచి థియేటర్‌లో ‘వైబ్’ పాట సందడి మొదలువుతుంది. ‘‘చాట్‌బాస్టర్ వైబ్ సాంగ్‌ను నేటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ‘మిరాయ్’ (Mirai Movie) ప్రదర్శితమవుతున్న అన్ని షోలలోనూ యాడ్ చేస్తున్నాం’’ అని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ పాటకు గౌర హరి సంగీతం అందించగా.. కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. అర్మాన్ మాలిక్ ఈ పాట పాడారు.
Also Read : దసరా నాడు టైటిల్ ప్రకటన