Friday, May 3, 2024

మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : మణిపూర్‌లో మరోసారి అల్లరి మూకలు రెచ్చిపోయాయి. గురువారం ఉదయం బిష్ణుపూర్ జిల్లా లోని మొరాంగ్‌ప్రాంతంలో కొన్ని ఇళ్లకు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల భయంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. మరోవైపు తమకు ప్రత్యేక పరిపాలన మండలి కావాలని డిమాండ్ చేస్తూ కుకీజో వర్గానికి చెందిన వారు గురువారం కాంగ్‌పోక్సి జిల్లాలో ప్రదర్శన నిర్వహించారు.

అలాగే సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ ఒప్పందంపై సంతకం చేసిన కుకీ వర్గంతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్‌చేశారు. ఈ ప్రదర్శనలో చిన్ కుకీమిజో వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. బుధవారం కూడా అల్లరి మూకలు మోరే సమీపం లోని సుమారు 30 కి పైగా గృహాలకు నిప్పు పెట్టారు. కాంగ్‌పోక్సి జిల్లాలో భద్రతా బలగాలు వినియోగించే రెండు రవాణా బస్సులకు నిప్పుపెట్టారు. ఈ సంఘటనతో సంబంధం ఉన్న ఓ మైనర్‌తో సహా 9 మందిని అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు.
మణిపూర్‌కు ఇండియా బృందం
ఈనెల 29, 30 తేదీల్లో విపక్ష కూటమి ఇండియాకు చెందిన 20 మంది పార్లమెంట్ సభ్యులు మణిపూర్‌లో పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకోనున్నట్టు కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ వెల్లడించారు. మణిపూర్‌లో పర్యటించాలని ఎంపీలు ఎప్పటినుంచో భావిస్తున్నా భద్రతా కారణాల పేరుతో అధికారులు అనుమతి ఇవ్వలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News