Monday, September 22, 2025

అవకాశాలు మళ్లీ మళ్లీ రావు.. అభిషేక్‌కు సెహ్వాగ్ సూచన

- Advertisement -
- Advertisement -

ఆసియాకప్-2025 టోర్నమెంట్‌లో సూపర్-4 మ్యాచుల్లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయంలో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) కీలక పాత్ర పోషించాడు. 39 బంతుల్లో 5 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో అభిషేక్ ఇన్నింగ్స్ మొదటి బంతినే సిక్స్‌గా మలిచాడు. దీంతో అతడిని అంతా డాషింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్‌తో పోలుస్తున్నారు.

అయితే దీనిపై తాజాగా అభిషేక్ (Abhishek Sharma) స్పందించాడు. ఇప్పటి పాక్ బౌలింగ్‌లో పస లేదని.. అప్పటి బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టమని అభిషేక్ వ్యాఖ్యానించాడు. అలాంటి బౌలింగ్‌లో సెహ్వాగ్ భారీ షాట్లు కొట్టేవాడని అన్నాడు. ఈ సందర్భంగా సెహ్వాగ్.. అభిషేక్‌కి ఓ సలహా ఇచ్చారు. సెంచరీ చేసే అవకాశాలు మళ్లీ మళ్లీ రావని సెహ్వాగ్ అన్నారు. ‘‘70లు, 80ల్లో కి వస్తే.. సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోవద్దు. ఇవే మాటలు నాకు సునీల్ గవాస్కర్ చెప్పారు. రిటైర్ అయిన తర్వాత ఇలా ఔటైన ఇన్నింగ్స్‌ గుర్తుకు వస్తుంటాయి. సెంచరీ చేజార్చుకుంటే బాగుండేది అని భావన కలుగుతుంది. అందుకే ఇలాంటి ఇన్నింగ్స్‌లను శతకాలుగా మలుచుకోవాలి. అవకాశాలు మళ్లీ మళ్లీ రావు. నీదైన రోజున నాటౌట్‌గా ఉండేందుకు ప్రయత్నించు’’ అంటూ సెహ్వాగ్ సూచించారు.

Also Read : భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News